»   » జూ ఎన్టీఆర్ పొగరు బయట పడబోతోంది!

జూ ఎన్టీఆర్ పొగరు బయట పడబోతోంది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నిజాయితీ, ముక్కుసూటి తనంతో ఉండే వారి ప్రవర్తన కొందరికి పొగరుగానే కనిపిస్తుంది. టాలీవుడ్ యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ కూడా రియల్ లైఫ్‌లో ఇలాగే ఉంటారు అనేది ఆయన గురించి బాగా తెలిసిన వారు అనే మాట. తాజాగా జూ ఎన్టీఆర్‌తో సినిమా చేయబోతున్న దర్శకుడు పూరి జగన్నాథ్ అతన్ని వెండి తెరపై పొగరుబోతుగా చూపించబోతున్నారట. సో...ఈ సినిమాలో జూ ఎన్టీఆర్‌ను రియల్ లైఫ్ క్యారెక్టర్లో చూడబోతున్నామన్నమాట!

ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ రఫ్ అండ్ టఫ్ పోలీసు పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన కాజల్‌ను హీరోయిన్‌గా తీసుకుంటున్నారు. ఈ చిత్రానికి 'రుబాబు', 'టెంపర్' అనే టైటిల్స్ పరిశీలిస్తున్నారు. ఎప్పుడూ సొంత స్క్రిప్టులతోనే సినిమాలు చేసే పూరి జగన్నాథ్ ఈ సారి వక్కతం వంశీ అందించిన స్టోరీతో సినిమా తీస్తుండటం విశేషం.

Jr NTR in Arrogance role!

గతంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'పోకిరి' అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా జూ ఎన్టీఆర్‌తో చేసే సినిమా కూడా అదే రేంజిలో ఉంటుందని అంటన్నారు. ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మించనున్నారు. గతంలో జూ ఎన్టీఆర్ 'బాద్ షా' చిత్రాన్ని నిర్మించి హిట్ కొట్టిన గణేష్ ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్‌తో చేసే ఛాన్స్ రావడంపై ఆనందంగా ఉన్నాడు.

ప్రస్తుతం జూ ఎన్టీఆర్ 'రభస' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. సినిమా పూర్తయిన వెంటనే పూరి జగన్నాథ్ తన సినిమాను ప్రారంభించడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు ఎన్టీఆర్. పక్కా ప్లానింగుతో సినిమా తీసే పూరి జగన్నాథ్ వీలైనంత త్వరగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడట. పదేళ్ల క్రితం పూరి జగన్నాథ్-జూ ఎన్టీఆర్ కాంబినేషన్లో 'ఆంధ్రావాలా'చిత్రం వచ్చింది. అయితే ఆ సినిమా పెద్దగా ఆడలేదు. చాలా కాలం తర్వాత ఇద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుండటంతో ఎన్టీఆర్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

English summary
Jr NTR would be seen as a rough & tough and Arrogance cop in his next film, directed by Puri Jagannath.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu