రాంచరణ్ కోసం చీఫ్ గెస్ట్‌గా ఎన్టీఆర్.. వినయ విధేయ రామ ప్రీరిలీజ్ ఈవెంట్, ఇంకా ఎవరంటే!
మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ ఎన్టీఆర్ కలసి భారీ మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్నారు. నవంబర్ 11న ఈ చిత్రం ప్రారంభమైంది. దర్శకధీరుడు రాజమౌళి ఈ చిత్రానికి దర్శత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి తరువాత రాజమౌళి దర్శత్వంలో రాబోతున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఎన్టీఆర్, రాంచరణ్ అతి త్వరలో ఒకే వేదికపై కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాంచరణ్ నటిస్తున్న వినయ విధేయ రామ చిత్రం సంక్రాంతికి విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.

విజయ విధేయ రామ ప్రీరిలీజ్ ఈవెంట్
విడుదుల సమయం దగ్గర పడుతుండడంతో వినయ విధేయ రామ చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలు మొదలు పెడుతోంది. ఆ మధ్యన విడుదల చేసిన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల ఫ్యామిలీ సాంగ్ ని విడుదుల చేసారు. దేవిశ్రీ సంగీతం అందించిన ఈ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. త్వరలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతునట్లు తెలుస్తోంది.

చీఫ్ గెస్ట్‌గా ఎన్టీఆర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా హాజరు కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ మాత్రమే కాదు రాజమౌళి కూడా ఈ ఈవెంట్ కు హాజరు కానున్నారట. వినయవిధేయ రామ చిత్రానికి, ఆర్ఆర్ఆర్ చిత్రానికి నిర్మాత దానయ్యే . దీనితో వినయ యవిధేయ రామ ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఆర్ఆర్ఆర్ టీంని చూడవచ్చు. భరత్ అనే నేను చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ కు కూడా ఎన్టీఆర్ గెస్ట్ గా హాజరైన సంగతి తెలిసిందే.

తొలిసారి బోయపాటితో
మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి కాంబినేషన్ లో వినయ విధేయ రామ చిత్రం తెరకెక్కుతోంది. అద్భుతమైన కమర్షియల్ అంశాలతో బోయపాటి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ దాదాపుగా పూర్తయిపోయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జనవరి 11 ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.

నటీనటులు
ఈ చిత్రంలో రాంచరణ్ సరసన భరత్ అనే నేను హీరోయిన్ కైరా అద్వానీ నటిస్తోంది. తమిళ హీరో ప్రశాంత్, స్నేహ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కుటుంబ బంధాలతో అద్భుతమైన ఫ్యామిలీ డ్రామాతో పాటు.. విలన్ తో కళ్ళు చెదిరే యాక్షన్ సన్నివేశాలని బోయపాటి తీర్చి దిద్దారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏ మేరకు సత్తా చాటుతుందో విడుదలయ్యాక చూడాలి.


Click it and Unblock the Notifications











