జూ ఎన్టీఆర్ బ్యాచిలర్ లైఫ్ కి గిప్ట్ బంగారు కిరీటం!
ఓ వైపు బృందావనం, శక్తి బిజీ షెడ్యూల్ మరోవైపు మూడు ముళ్ళు బందంతో ఏడడుగులు నడిచేందుకు తయారవుతున్న జూ ఎన్టీఆర్ బర్త్ డే వేడుకలు ముందెన్నడూ లేనంత ప్రత్యేకంగా జరుగబోతున్నాయి. గత ఏడాది ఎన్నికల ప్రచారంలో రోడ్డు ప్రమాదానికి గురైన ఎన్టీఆర్ తనకిది పునర్జన్మ అని ప్రకటించాక వస్తోన్న ఈ పుట్టినరోజుని అత్యంత ఆడంబరంగా జరపాలని తన అభిమానులు సన్నాహాలు చేస్తున్నారు.
మే 20కి 28 వసంతాలు పూర్తి చేసుకుని తన 29వ ఏట అడుగు పెట్టనున్న ఎన్టీఆర్ కి బర్త్ డే విషెష్ తెలుపుతూ పత్రికల్లో, టీవిల్లో ప్రకటనలిచ్చేందుకే ఆయన ఆయన అభిమానులు పెద్ద మొత్తాన్ని వెచ్చిస్తున్నారు. అంతే కాదు..తమ అభిమాన హీరోకి బర్త్ డే గిప్ట్ గా బంగారు కిరీటాన్ని బహూకరించాలనే ఉద్ధేశ్యంతో దాదాపు కిలో బంగారాన్ని కొనుగోలు చేసి పసిడి వర్ణాలతో ధగధగలాడే శిరస్త్రాణాన్ని సిద్దం చేయించారని తెలుస్తోంది.
మరైతే ఇండస్ట్రీలో తారక్ ని బహుమతులతోనూ, శుభాకాంక్షలతోనూ ముంచెత్తే వారి సంఖ్య కూడా భారీగానే వుంటుంది. అయితే వీటన్నిటినీ మించి తనకు కాబోయే జీవిత భాగస్వామి ప్రణీత సమక్షంలో తొలిసారి బర్త్ డే కేక్ కట్ చేయనున్న ఎన్టీఆర్ కి అన్నివిధాలా ఇది మరపురాని పుట్టిరోజు కానుంది.


Click it and Unblock the Notifications











