ఎన్టీఆర్ కి బోయపాటి శ్రీను చెప్పిన టైటిల్ పిచ్చపిచ్చగా నచ్చేసింది
ఎన్టీఆర్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రానికి గర్జన, చురకత్తి అంటూ రకరకాల టైటిల్స్ బయిటకు వచ్చాయి. అయితే తాజాగా ఈ చిత్రానికి టైగర్ అనే టైటిల్ పెడితే ఎలా ఉంటుందని బోయపాటి ప్రస్దావించటం దానికి యంగ్ టైగర్ గా పేరొందిన ఎన్టీఆర్ సై అనటం జరిగిందని సమాచారం. ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ లో కెయస్ రామారావు నిర్మాణ సారధ్యంలో త్వరలో రూపుదిద్దుకోనుంది. తాజా సమాచారం ప్రకారం జూ ఎన్టీఆర్ 'చురకత్తి" అనే టైటిల్ కాస్తా 'టైగర్ "గా రాబోతోంది. రీసెంట్ గా ఈ టైటిల్ ను ఫిల్మిం ఛాంబర్ లో రిజిస్టర్ చేశారని సమాచారం. కాగా కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ జూ ఎన్టీఆర్ సరసన నటించనుంది. అలాగే సెకెండ్ హీరోయిన్ గా ప్రియమణిని ఎంపిక చేసారు. రెగ్యులర్ షూటింగ్ ఎన్టీఆర్ వివాహానతరం ప్రారంభం కానుంది. అలాగే ఎమ్.ఎమ్.కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు.


Click it and Unblock the Notifications











