For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బుచ్చిబాబు సినిమాలో కోచ్‌గా ఎన్టీఆర్: కథ, హీరోయిన్‌తో పాటు ముఖ్యమైన వివరాలన్నీ లీక్

  |

  ఈ మధ్య కాలంలో వరుసగా హిట్లు మీద హిట్లు అందుకుంటూ దూసుకుపోతున్నాడు టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఏకంగా ఐదు విజయాలను సొంతం చేసుకుని ఉన్న అతడు.. ఈ జోష్‌లోనే ఫ్యూచర్ ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా లైన్‌లో పెట్టుకుంటున్నాడు. అతడు ఇప్పటికే దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తోన్న RRRలో నటిస్తున్నాడు. ఇది షూటింగ్ జరుగుతుండగానే.. మరికొన్ని సినిమాలను అనౌన్స్ చేశాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ స్టార్ హీరో 'ఉప్పెన'తో మంచి గుర్తింపును అందుకున్న బుచ్చిబాబు సనతో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. తాజాగా దీనికి సంబంధించిన కథ, హీరోయిన్ సహా పూర్తి వివరాలు బయటకు వచ్చాయి. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  వరుసగా ఐదు విజయాలతో హవా

  వరుసగా ఐదు విజయాలతో హవా

  కెరీర్‌లో తొలిసారి భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు తారక్. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'టెంపర్' నుంచి వరుసగా 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్', 'జై లవ కుశ', 'అరవింద సమేత.. వీరరాఘవ' వంటి హిట్లను తన ఖాతాలో వేసకున్నాడు. అదే సమయంలో మార్కెట్‌ను కూడా భారీగా పెంచుకున్నాడు. దీంతో అతడి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారని చెప్పొచ్చు.

  మళ్లీ బికినీలో రచ్చ చేసిన పూజా హెగ్డే: ఈ సారి తడిచిన అందాలతో అంతకు మించి!

  ప్రతిష్టాత్మకమైన చిత్రంలో భాగం

  ప్రతిష్టాత్మకమైన చిత్రంలో భాగం

  ఈ మధ్య కాలంలో యమ జోష్ మీదున్న ఎన్టీఆర్.. ప్రస్తుతం రాజమౌళి రూపొందిస్తోన్న RRR (రౌద్రం రణం రుధిరం) అనే సినిమాలో రామ్ చరణ్‌తో కలిసి నటిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ మూవీని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో తారక్.. కొమరం భీంగా, చరణ్.. అల్లూరి పాత్రలను పోషిస్తున్నారు. ఆలియా భట్, ఒలీవియా హీరోయిన్లుగా నటిస్తున్నారు.

  ఒకరిని కాదని.. మరో దర్శకుడితో

  ఒకరిని కాదని.. మరో దర్శకుడితో

  RRR షూటింగ్ జరుగుతుండగానే తారక్ తన 30వ సినిమాను త్రివిక్రమ్‌తో చేస్తున్నట్లు ప్రకటించాడు. అయితే, ఇది ప్రకటనకే పరిమితం అయిపోయింది. ఎన్నో మలుపుల నడుమ ఈ సినిమాను ఆపేసినట్లు ప్రకటించారు. అనంతరం 30వ ప్రాజెక్టును కొరటాల శివతో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీనిని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి.

  మరోసారి రెచ్చిపోయిన దిశా పటానీ: ఈ సారి అలా పడుకుని మామూలు రచ్చ కాదుగా!

  ప్రశాంత్ నీల్‌తో సినిమా అనౌన్స్

  ప్రశాంత్ నీల్‌తో సినిమా అనౌన్స్

  నందమూరి హీరో ఎన్టీఆర్ వరుసగా ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ఇందులో భాగంగానే ఈ స్టార్ హీరో ఇప్పటికే కొరటాల శివతో సినిమాను అనౌన్స్ చేశాడు. దీని తర్వాత అతడు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో సినిమా చేయబోతున్నాడు. ఈ విషయాన్ని గత ఏడాదే అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది.

  బుచ్చిబాబు సనతో సినిమాకు సై

  బుచ్చిబాబు సనతో సినిమాకు సై

  ఇప్పటికే మూడు ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్.. ఈ క్రమంలోనే 'ఉప్పెన' ద్వారా మొదటి చిత్రంతోనే భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు సనతో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం సదరు డైరెక్టర్ స్పోర్ట్స్ బేస్ స్క్రిప్టును రెడీ చేస్తున్నాడట. దీన్ని కూడా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుందట.

  బాడీ పార్టులన్నీ చూపిస్తూ అనన్య నాగళ్ల అరాచకం: తెలుగమ్మాయిని ఇంత హాట్‌గా ఎప్పుడూ చూసుండరు!

  కథ మొత్తం లీక్.. ఆ రోల్‌లో తారక్

  కథ మొత్తం లీక్.. ఆ రోల్‌లో తారక్


  బుచ్చిబాబు సనతో ఎన్టీఆర్ సినిమా చేయడం దాదాపుగా ఖాయం అయిందని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. అంతేకాదు, ఈ సినిమా స్టోరీ లైన్ కూడా లీకైంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా 1960 కాలం నాటి ఖోఖో గేమ్ నేపథ్యంతో రూపొందనుందట. ఇందులో ఎన్టీఆర్ ఆ గేమ్‌కు కోచ్‌గా నటిస్తున్నాడట. పల్లెటూరి వాతావరణంతో ఇది తెరకెక్కునుందని టాక్.

  Recommended Video

  Senior Actor Rajasekhar In Jr.NTR's Next Project | Filmibeat Telugu
  హీరోయిన్‌గా శ్రీదేవి కూతురు అని

  హీరోయిన్‌గా శ్రీదేవి కూతురు అని

  ఎన్టీఆర్‌తో బుచ్చిబాబు చేసే సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా పూర్తైందట. దీన్ని ప్రశాంత్ నీల్‌ సినిమా కంటే ముందే చేయబోతున్నారని తెలుస్తోంది. పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుందని అంటున్నారు. ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఆమెకు అడ్వాన్స్ కూడా ఇచ్చేసిందనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది.

  English summary
  Jr NTR has given a green signal to a film in the direction of Buchi Babu Sana. Now This Movie Story and Heroine Details Leaked.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X