Ram Charan Vs Jr NTR: పెద్దితో డ్రాగన్ బాక్సాఫీస్ ఫైట్.. అందుకే ఎన్టీఆర్ వెనక్కి?

ఒకప్పుడు మన తెలుగు సినిమా స్టార్ హీరోస్ నడుమ బంధాలు ఎంతో బాగుండేవి కానీ క్రమంగా వారి స్టార్డం పెరుగుతూ వస్తున్న కొద్దీ ఆ స్టార్డం హీరోస్ నడుమ దూరాన్ని కూడా పెంచుకుంటూ వచ్చింది. ఇలా ఒకప్పుడు ఎంతో స్నేహంగా ఉండే హీరోలు ఇపుడు దూరం అయ్యారు. కాగా ఇంకొందరు అయితే బయటకి చెప్పకపోయినప్పటికీ పోటీతత్వం మాత్రం గట్టిగానే చూపిస్తున్నారు అనే టాక్ కూడా వినిపించేది.

కాగా అలాంటి హీరోస్ లో ఇపుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అలాగే మ్యాన్ ఆఫ్ మాసేసం ఎన్టీఆర్ లు కోసం చెప్పుకోక తప్పదు. అయితే ఇద్దరు హీరోస్ కలిపి ఆర్ ఆర్ ఆర్ అనే సెన్సేషనల్ సినిమా కలిసి చేశారు. ఆ తర్వాత నుంచి అసలు రచ్చ మొదలైంది. ఇద్దరూ బయటకి చెప్పుకోకపోవచ్చు కానీ ఇద్దరు హీరోస్ నుంచి ఆ సినిమా తర్వాత వచ్చిన సోలో సినిమాలు రిలీజ్ అయ్యాక డే 1 వసూళ్ళని చూస్తేనే ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు.

Ram Charan Vs Jr NTR

RRR తర్వాత ఎన్టీఆర్ నుంచి వచ్చిన సోలో సినిమా దేవర కి మేకర్స్ ఏకంగా 170 కోట్లకి పైగా డే 1 గ్రాస్ ని వేసుకున్నారు. అయితే దీనిని చాలా మంది నమ్మలేదు కానీ దీనిని కొట్టాలని అనుకున్నట్టుగా రామ్ చరణ్ సోలో సినిమా గేమ్ ఛేంజర్ కి ఏకంగా 180 కోట్లకి పైగా వేసుకోవడంతో రామ్ చరణ్ అభిమానులు హైయెస్ట్ డే 1 ఎన్టీఆర్ కంటే మాదే ఉందని చెప్పుకుంటున్నారు.

ఇలా బాక్సాఫీస్ లెక్కలు పరోక్షంగా ఇద్దరు హీరోలు సీరియస్ గానే తీసుకున్నట్టుగా ఇక్కడ అనిపిస్తుంది. ఇద్దరూ ఎక్కడ తగ్గకూడదు అన్నట్టే నంబర్స్ వేసుకున్నారని సినీ వర్గాల్లో టాక్ కూడా నడిచింది. కాగా ఈ తర్వాత మళ్ళీ అసలు రచ్చ స్టార్ట్ అయ్యింది. ఇక్కడ గేమ్ ని ఎన్టీఆర్ మార్చినట్టుగా ఉన్నాడని చెప్పొచ్చు. దేవర, గేమ్ ఛేంజర్ తర్వాత మళ్ళీ మొదటిగా ఎన్టీఆర్ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సినిమా జనవరిలో రావాల్సి ఉంది.

ప్రస్తుతానికి డ్రాగన్ గా చెలామణి అవుతున్న ఈ భారీ సినిమా అనుకున్నట్టుగా జనవరిలో వస్తే దీనికి గేమ్ ఛేంజర్ కి మించి భారీ వసూళ్లు డే 1 కి వేసుకోవచ్చు కానీ మళ్ళీ వెంటనే మార్చ్ లో రిలీజ్ కానున్న రామ్ చరణ్ భారీ చిత్రం పెద్ది సినిమా దానిని కొట్టేసి హైయెస్ట్ వసూళ్లు వేసుకుంటారు అని అక్కడ నుంచి మళ్ళీ ఎన్టీఆర్ సినిమా వచ్చే వరకు పెద్ది పేరిటే ఆ రికార్డులు ఉండాల్సి వస్తుంది.

అందుకే తారక్ తెలివిగా పావు కదిపాడు చెప్పాలి. పెద్ది సినిమా మార్చ్ లో ఫిక్స్ చేస్తే రీసెంట్ గా ఎన్టీఆర్ నీల్ ల డ్రాగన్ సినిమాని జూన్ కి సెట్ చేశారు. సో పెద్ది సినిమాకి స్కోప్ లేకుండా పోయింది. ముందు ఇదే వస్తుంది కాబట్టి డ్రాగన్ సినిమా ఓపెనింగ్స్ రామ్ చరణ్ సినిమా కంటే ఎక్కువే వేసుకునే ఛాన్స్ ఉంది. సో మళ్ళీ రామ్ చరణ్ సినిమా వచ్చే వరకు ఆల్ టైం హైయెస్ట్ వసూళ్లు RRR హీరోస్ లో ఎన్టీఆర్ పేరు మీదే కొనసాగుతాయి. ఇలా ఇద్దరి హీరోస్ నడుమ బాక్సాఫీస్ లెక్కల వార్ కొనసాగుతుంది అని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

More from Filmibeat

Read more about: jr ntr ram charan peddi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X