జూ.ఎన్టీఆర్ నిజాయతీ ఉన్నోడేట
హైదరాబాద్ : ఎన్టీఆర్ హీరోగా పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కాజల్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ అవినీతి పోలీస్ అధికారి పాత్ర పోషిస్తాడని ప్రచారం జరుగుతోంది. రీసెంట్ గా రవితేజ నటించిన పవర్ చిత్రం విడుదలైంది. అందులో రవితేజ అవినీతి పోలీస్. దాంతో పవర్ లాంటి కథ అంటూ మీడియాలో ఓ వర్గం ప్రచారం మొదలెట్టింది. ఈ నేపధ్యంలో నిర్మాత బండ్ల గణేష్ ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర గురించి నిజాయతీగల పాత్ర అని బయిటకు వచ్చింది.
''చట్టం పట్ల నిబద్ధత, సమాజంపై పూర్తిస్థాయి అవగాహన ఉన్న నిజాయతీగల పోలీసు అధికారి కథ ఇది. ఎన్టీఆర్ పాత్ర, కథ, కథనం ప్రధానాంశాలుగా సినిమా రూపొందుతోంది. గత చిత్రాల్లో ఎన్టీఆర్ పోలీసు పాత్ర పోషించినా అది కొద్దిసేపు మాత్రమే. ఈ సినిమాలో పూర్తి నిడివి ఉన్న పోలీసు అధికారిగా కనిపిస్తాడు. పూరి శైలిలో ఎన్టీఆర్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది'' అంటున్నారు.

ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. బండ్ల గణేష్ నిర్మాత. సినిమా రెండో షెడ్యూల్ చిత్రీకరణ ఈ నెల 26 నుంచి ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లో ఎన్టీఆర్ సహా చిత్ర ప్రధాన తారాగణంపై ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తారు.
ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అలీ, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, మధురిమ, వెన్నెల కిశోర్, జయప్రకాశ్‌రెడ్డి, సప్తగిరి, కోవై పరళ, రమాప్రభ, పవిత్రా లోకేశ్ తారాగణం. ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, ఛాయాగ్రహణం: శ్యామ్ కె. నాయుడు, ఫైట్స్: విజయ్, సమర్పణ: శివబాబు బండ్ల.


Click it and Unblock the Notifications











