twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్‌బాస్‌కు ఎన్టీఆర్ కండిషన్లు.. బ్రేక్ వేస్తున్న రాజమౌళి? కన్‌ఫ్యూజన్‌లో ‘హోస్ట్‌’

    |

    Recommended Video

    #BiggBossTelugu3 : Jr.NTR Puts Some Condition For Season 3 | Filmibeat Telugu

    తెలుగులో మొట్టమొదటి బిగ్‌బాస్ షోకు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించడంతో ఆ కార్యక్రమం మరోస్థాయికి వెళ్లిన సంగతి తెలిసిందే. తెలుగు బిగ్‌బాస్‌ షోకు ఎన్టీఆర్ ఓ క్రేజ్ తెచ్చారనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అయితే రెండో సీజన్‌ నుంచి తప్పుకోవడంతో నేచురల్ స్టార్ నాని తెరపైకి వచ్చారు. అయితే ఎన్టీఆర్ హోస్ట్‌గా చేసిన తర్వాత ఆ మార్కును అందుకోవడానికి నాని తంటాలు పడ్డారనే వాదన కూడా వినిపించింది.

    అయితే బిగ్‌బాస్‌ను మరోస్థాయికి తీసుకెళ్లలేకపోయాడనే మాట వినిపించింది. దాంతో తాజాగా మూడో సీజన్‌కు మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది. అయితే తారక్ ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరించడానికి ఒప్పకొంటారా? అనే ప్రశ్న రేకెత్తుతున్న నేపథ్యంలో పలు ఆసక్తికరమైన కథనాలు మీడియాలో కనిపిస్తున్నాయి. అవేమిటంటే..

    బిగ్‌బాస్ షోకు హోస్ట్‌గా తారక్

    బిగ్‌బాస్ షోకు హోస్ట్‌గా తారక్

    బిగ్‌బాస్ షోకు హోస్ట్‌గా వ్యవహరించకపోవచ్చు. ఇప్పటికిప్పుడు ఎన్టీఆర్‌కు మార్కెట్ పెంచుకోవాలనే ఆత‌‌ృత లేదు. అంతేకాకుండా భారీ ప్రాజెక్టులు చేతిలో ఉన్నాయి. వాటిని పక్కన పెట్టకపోయినా ఏక కాలంలో రెండు పడవలపై కాలు మోపి రిస్క్ తీసుకొనే ప్రయత్నం ఎన్టీఆర్ చేయకపోవచ్చు అనే మాటలు వినిపిస్తున్నాయి.

     ఎస్ఎస్ రాజమౌళి ఒప్పుకొంటాడా?

    ఎస్ఎస్ రాజమౌళి ఒప్పుకొంటాడా?

    ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న RRR మూవీలో ఎన్టీఆర్ కీలక పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రెండు రకాల షేడ్స్ ఉన్న పాత్రలో తారక్ కనిపించబోతున్నాడని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. అందుచేత బిగ్‌బాస్‌‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తే గెటప్ బయటకు వచ్చే అవకాశం లేకపోలేదు. అందుచేత రాజమౌళి అందుకు ఒప్పుకొంటాడా అనేది మరో ప్రశ్న.

    వివాదాస్పదంగా రెండో సీజన్

    వివాదాస్పదంగా రెండో సీజన్

    బిగ్‌బాస్ గత సీజన్‌లో కొన్ని విషయాలు వివాదాస్పదంగా నిలిచాయి. అందులో కంటెస్టెంట్ల ఎంపిక, ఓట్ల గణన తదితర అంశాలపై చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియాలో అనుమానాలు వ్యక్తం చేశారు. దాంతో బిగ్‌బాస్‌పై ఉన్న క్రేజ్ కొంత మసకబారినట్టు కనిపించింది. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ మేనేజ్‌మెంట్‌కు ఎన్టీఆర్ కొన్ని షరతులు విధించినట్టు ఓ వార్త ప్రచారంలో ఉంది.

    బిగ్‌బాస్‌కు ఎన్టీఆర్ షరతులు

    బిగ్‌బాస్‌కు ఎన్టీఆర్ షరతులు

    హోస్ట్‌గా ఒప్పుకోవడానికి ముందు ఎన్టీఆర్ బిగ్‌బాస్ మేనేజ్‌మెంట్‌కు విధించిన షరతుల ఇలా ఉన్నాయని తెలుస్తున్నది. మూడో సీజన్ కోసం ఎంపిక చేసిన ఇంటి సభ్యుల జాబితా. పరిశీలనలో ఉన్న వ్యక్తుల వడపోత విధానం పక్కాగా ఉండాలని, అలాగే ఎవరి ప్రోద్బలం, లాబీయింగ్ వల్ల ఇంటి సభ్యులను ఎంపిక చేయవద్దని షరతులు పెట్టినట్టు తెలుస్తున్నది.

    సీక్రెట్‌గా బిగ్‌బాస్ షో

    సీక్రెట్‌గా బిగ్‌బాస్ షో

    బిగ్‌బాస్ షో అనేది పక్కాగా సీక్రెట్‌గా సాగే వ్యవహారం. ప్రస్తుతం వార్తలు చూస్తుంటే ఇలాంటి వార్తలు బయటకు పొక్కడానికి అవకాశం లేదనే చెప్పొచ్చు. నిజంగా ఎన్టీఆర్ ఇలాంటి షరతులు విధిస్తే అవి బయటకు వచ్చే అవకాశమే ఉండదు. కాబట్టి ఎన్టీఆర్ బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తారా లేదా అనేది కొన్ని రోజులు ఆగితే స్పష్టమవుతుంది.

    English summary
    Bigg Boss Telugu Show is getting ready for Third season. Now its big debate is going in media that.. NTR would be a host for 3rd one. In this occassion, Report Suggest that Jr NTR put conditions to Bigg Boss on Candidate selection process.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X