twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ రెండు ఎన్టీఆర్ చిత్రాలు కూడా జపనీస్ భాషలోకి...

    By Srikanya
    |

    Jr NTR craze in Japan.
    హైదరాబాద్: ఎన్టీఆర్ కు జపాన్ లో క్రేజ్ రోజు రోజుకీ పెరుగుతోంది. తాజాగా అతని మరో రెండు చిత్రాలు డబ్ చేయటానికి నిర్ణయించుకున్నట్లు సమాచారం. అవి.. 'యమదొంగ', 'సింహాద్రి' . రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ రెండు చిత్రాలను కూడా అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ ఆసక్తి చూపటంతో అనువాదాలుగా వెళ్లే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

    ఎన్టీఆర్,శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన 'బాద్‌షా'ని త్వరలో జపాన్‌లో విడుదల చేయబోతున్నారు. ఈ యేడాది జపాన్‌లో ఇండియన్‌ ఫిల్మ్‌ఫెస్టివల్‌ నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు ఎన్టీఆర్‌ని అతిథిగా ఆహ్వానించాలని నిర్వాహకులు భావిస్తున్నారు. త్వరలో ఓ బృందం ఎన్టీఆర్‌ని ఆహ్వానించడానికి హైదరాబాద్‌ రానుంది.

    ఇక జపాన్‌ సినీ ప్రియులకు భారతీయ సినిమా అంటే... నిన్నా మొన్నటి వరకూ రజనీకాంత్‌ చిత్రాలే. 'బాషా' చిత్రంతో రజనీ హవా అక్కడ మొదలైంది. ఇప్పుడు ఎన్టీఆర్‌కీ అక్కడ క్రేజ్‌ మొదలైంది. రజనీ స్త్టెల్‌కి దాసోహమన్న అక్కడి ప్రేక్షకులు ఇప్పుడు ఎన్టీఆర్‌ స్టెప్పులకు అభిమానులుగా మారిపోయారు. జపాన్‌లో నృత్య పోటీలు ఎక్కడ జరిగినా అక్కడ ఎన్టీఆర్‌ పాట తప్పకుండా వినిపిస్తుందట.

    ఫిజీ అనే ఓ టీవీ ఛానల్‌ అప్పట్లో ఎన్టీఆర్‌పై ఓ ప్రత్యేక డాక్యుమెంటరీ రూపొందించింది. దాని కోసం ఇండియా వచ్చి ఎన్టీఆర్‌ ఇంటర్వ్యూ తీసుకొన్నారు కూడా. ఆ సందర్భంగా ఎన్టీఆర్‌ జపనీస్‌ నేర్చుకొని.. ఆ భాషలో కాసేపు మాట్లాడారు. ఇప్పుడు ఎన్టీఆర్‌ సినిమాలు కూడా జపనీస్‌లో అనువాదాలుగా వెళ్లనున్నాయి.

    ఎన్టీఆర్ సినిమాల వివరాల్లోకి వెళితే.....ప్రస్తుతం ఎన్టీఆర్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'రభస'(వర్కింగ్ టైటిల్) అనే చిత్రం చేస్తున్నారు. త్వరలో ఆయన సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నట్లు టాక్. నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారట.

    English summary
    
 Ntr's Hits Baadshah, Student No.1, Simhadri, Yamadonga were being dubbed into Japanese. Already Badshah makers have signed an agreement with Japanese team to sell the film rights.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X