RRR చావు దెబ్బ.. ఎన్టీఆర్ కీలక నిర్ణయం.. ఏమాత్రం డిజప్పాయింట్ చేయకుండా?

RRR కోసం జూనియర్ ఎన్టీఆర్ తన మూడు సంవత్సరాల సమయాన్ని కేటాయించాడు. RRRకు అగ్ర ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా RRR విడుదల అయ్యే వరకు ఇతర ప్రాజెక్ట్‌లు ఏవీ చేపట్టకుండా ఉండాలని ఆయన అనుకున్నాడు. రామ్ చరణ్ తన ఆచార్య సినిమా చేసినా ఎన్టీఆర్ మాత్రం పక్క చూపులు చూడలేదు. ఇప్పుడు ఆ కారణంగా ఆయన కీలక నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

RRR విశ్వ రూపం చూసి

RRR విశ్వ రూపం చూసి

జూనియర్ ఎన్టీఆర్ చివరి విడుదల 2018లో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ. కాబట్టి ఎన్టీఆర్ అభిమానులు ఆయన సినిమాను థియేటర్ లో చూసి మూడేళ్ల దాకా అవుతోంది. రిపోర్టు ప్రకారం, జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు కోల్పోయిన సమయాన్ని భర్తీ చేయాలనుకుంటున్నారు. బాక్సాఫీస్ వద్ద RRR విశ్వ రూపం చూసిన తర్వాత మరో సినిమా ప్రారంభించాలనుకున్న ఎన్టీఆర్ ఇతర ప్రాజెక్ట్‌ల విషయంలో సంయమము పాటిస్తున్నారు.

RRR రిజల్ట్ చూసి

RRR రిజల్ట్ చూసి

రాజమౌళి తెరకెక్కించిన మెగా ఎపిక్ మూవీ RRR రిజల్ట్ చూసి దర్శకుడు శివ కొరటాల సినిమాతో 2022 లో షూటింగ్ స్టార్ట్ చేయాలని ఎన్టీఆర్ అనుకున్నాడు. పాన్-ఇండియా ప్రాజెక్ట్ రాజమౌళి యొక్క 'RRR' తనను తదుపరి స్థాయికి తీసుకెళ్తుందని ఎన్టీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ ఫలితం తారుమారైంది. ఎందుకంటే 'RRR' నిరవధికంగా వాయిదా పడింది. ఈ సినిమా మళ్ళీ ఎప్పుడు మొదలు కానుంది అనేది కూడా తెలియని పరిస్థితి.

 కొరటాల సినిమాతో పాటు మరో సినిమా

కొరటాల సినిమాతో పాటు మరో సినిమా

అతను ఇప్పుడు 'RRR' ఫలితం తెలియకుండానే శివ కొరటాల చిత్రాన్ని ఎన్టీఆర్ ప్రారంభించాల్సి ఉంటుంది. అందుతున్న సమాచారం మేరకు ఇప్పటి వృధా ఖర్చు అయిన సమయాన్ని భర్తీ చేసేందుకు ఎన్టీఆర్ ఇప్పుడు ఏకకాలంలో రెండు సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. ఎన్టీఆర్ కొరటాల సినిమాతో పాటు మరో సినిమాను కూడా త్వరలో ప్రారంభించనున్నారు. అది బుచ్చి బాబు సానా తదుపరి ప్రాజెక్ట్ కావచ్చు లేదా మరేదైనా కావచ్చు అని అంటున్నారు.

 వచ్చే ఏడాది

వచ్చే ఏడాది


'ఉప్పెన' సినిమా తెరకెక్కించి మంచి పేరు తెచ్చుకున్న బుచ్చిబాబు ఇప్పటికే ఎన్టీఆర్‌కి స్క్రిప్ట్‌ను వినిపించారు, అలాగే ఆయనకు ఈ కధకు గాను ఎన్టీఆర్ నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చింది. కానీ దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. ఇక ఆయనతోనే కాక ఎన్టీఆర్ 'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో కూడా కలిసి పని చేయనున్నారు. అయితే ప్రభాస్ 'సాలార్'తో బిజీగా ఉన్నందున ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది సెట్స్‌పైకి వస్తుందని అంటున్నారు.

Recommended Video

RRR Moivie : Ram Charan Is Calm But Jr NTR Is A Tsunami - SS Rajamouli | Filmibeat Telugu
వచ్చే నెలలో

వచ్చే నెలలో

ఇక అందుతున్న సమాచారం మేరకు కొరటాల శివ - ఎన్టీఆర్ ల సినిమా షూటింగ్ మాత్రం వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ఒకటి రెండు నెలల తర్వాత బుచ్చిబాబు సినిమాని ప్రారంభించే అవకాశం ఉందని అంటున్నారు. గత మూడేళ్లలో ఎన్టీఆర్‌కు ఒక్కటి కూడా విడుదల చేయకపోవడంతో, ఇప్పుడు పనులు వేగంగా జరగాలని కోరుకుంటున్నాడు. ఈ నటుడు ఒకేసారి రెండు ప్రాజెక్ట్‌లను చేపట్టాలనుకుంటున్నాడు, తద్వారా అతను వేగంగా పూర్తి చేసి తన అభిమానులకు విజువల్ ఫీస్ట్ ఇవ్వగలనాని భావిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X