ఎన్టీఆర్ 'దమ్ము' లో దుమ్ము రేపే డైలాగు ఇదే
ఎన్టీఆర్ తాజా చిత్రం దమ్ము. సింహా వంటి సూపర్ హిట్ ఇచ్చిన బోయపాటి శీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో డైలాగు అంటూ ఒకటి ప్రచారంలోకి వచ్చింది. అదేమిటంటే...
"మబ్బు కనపడితే వర్షం పడుతుందని ఎక్సపెక్ట్ చేయొచ్చు,
గాలి వస్తే తుఫాన్ పడుతుందని ఎక్సపెక్ట్ చేయొచ్చు....
కాని నేను కొడితే బ్రతుకుతావని మాత్రం ఎక్సపెక్ట్ చేయొద్దు..."
ఎన్టీఆర్ ..చెప్పే ఈ డైలాగుకి ధియోటర్స్ లో మంచి రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు.ఇక ఈమధ్యన కొత్తగా విడుదలయ్యే చిత్రాలలోని డైలాగులు ముందుగానే క్రేజ్ కోసం విడుదల చేస్తున్నారు.మహేష్ ఖలేజాకీ,ఎన్టీఆర్ ...ఊసరవెల్లి చిత్రానికి డైలాగులు ముందే విడుదల చేసి సినిమాపై క్రేజ్ క్రియేట్ చేసారు. ఇక దమ్ములో సెకెండ్ హీరోయిన్ గా ఇషా ఛావ్లాని ఎంపిక చేసినట్లు సమాచారం. సునీల్ సరసన పూలరంగడు చిత్రంలో చేస్తున్న ఆమెను ఈ భారీ ఆఫర్ వరించింది.ఇక కొద్ది రోజుల క్రితం..ఈ చిత్రం నుండి డేట్స్ సర్దుబాటు చెయ్యలేక శృతి హాసన్ బయిటకు వెళ్లిపోయింది. ఆమె ప్లేసులో కాజల్ ని మెయిన్ హీరోయిన్ గా ఎన్నుకున్నారు.
ఈ చిత్రం షూటింగ్ ఈ నెలాఖరుకు మొదలు కానుంది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ ఎక్కడ మాట్లాడినా 'దమ్ము"ప్రసక్తి తెస్తున్నారు. ఆ చిత్రం ఫ్యాన్స్ కి విందు భోజనంలా ఉంటుందని అని పని గట్టుకుని మరీ చెప్తున్నారు. అలాగే తాను లావు తగ్గి చేసే డాన్స్ లు హైలెట్ గా ఉంటాయని నొక్కి మరీ చెపున్నారు. భవిష్యత్ లో తాను లావు గా కనపడనని, గతంలో కనపించినంత లావుగా కానని,తగ్గిపోతానని,ఆ విషయం దమ్ము చిత్రం లో గమనించవచ్చునని ఎన్టీఆర్ తన అభిమానులకు హామీ ఇచ్చారు. అలాగే జూ. ఎన్టీఆర్ ఇక తన దృష్టినంతా తాజా చిత్రం 'దమ్ము"పై కేంద్రీకరిస్తున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.యస్.రామారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
బాలకృష్ణతో గత సంవత్సరం 'సింహా"లాంటి విజయవంతమైన చిత్రాన్ని అందించిన తర్వాత బోయపాటి శ్రీను చేస్తోన్న ఈ చిత్రం పట్ల ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా బోయపాటి శ్రీను తనదైన శైలిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడని చెప్తున్నారు. అలాగే ఈ చిత్రానికి 'దమ్ము" అనే టైటిల్‌ని త్వరలో అధికారికంగా ఖరారు చేయనున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఎన్టీఆర్ మీడియా సమావేశంలో ధృవీకరించారు. ఈ చిత్రానికి సంబంధించిన మరో షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. మార్చిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి యం.యం.కీరవాణి సంగీతాన్నందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











