ఎన్టీఆర్ డాన్స్ 'అదుర్స్' అంటున్న షీలా!
వి.వి,వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'అదుర్స్"లో నటిస్తున్న షీలా 'అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని" అన్నట్లు ప్రేక్షకులను మంత్రముగ్ధం చేసే అందం, ఆ అందాన్ని అడిగిందే తడవుగా ఆరబోసే ఔదార్యం, ఆకట్టుకునే అభినయం..పుష్కలంగా ఉన్నా షీలాకు సరైన గుర్తింపు రావడం లేదు. అయితే తను తాజాగా ఎన్టీఆర్‌తో నటిస్తున్న చిత్రం తనకు మంచి గుర్తింపునిస్తుందని షీలా చాలా ఆశలు పెట్టుకుంటోంది. ముఖ్యంగా జూ.ఎన్టీఆర్ డాన్సులకు తాను వీరాభిమానినైపోయానని, అతని డాన్సులు 'అదుర్స్" అని కనిపించినవాళ్లందరికీ చెబుతోందంట షీలా!
యువ హీరోల్లో డాన్స్ విషయానికొస్తే అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ పేర్లు ప్రముఖంగా విన్పించేవి నిన్న మొన్నటిదాకా. ఇప్పుడు చిరుతతో ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తేజ మగధీరలో కూడా డాన్సుల్లో తండ్రికి తగ్గ తనయుడినని నిరూపించుకున్నాడు. ఈ నేపధ్యంలో డాన్స్ విషయంలో ఇప్పుడు పోటి అంతా జూనియర్ ఎన్టీఆర్, చరణ్ మధ్యేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పోటిలో పైచేయి సాధించేందుకు, 'అదుర్స్" సినిమా విషయంలో జూనియర్ డాన్సులపై ప్రత్యేక శ్రద్ద పెట్టాడట. మొత్తమ్మీద 'అదుర్స్" తో డాన్సుల్లో తనకు ఎదురులేదని నిరూపించుకునేందుకు జూనియర్ ఎన్టీఆర్ పడుతున్న తాపత్రయం, హీరోయిన్ షిల తో పాటు ప్రేక్షకులు కూడా తెరపై చూడటానికి వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











