తాత కోసం జూ ఎన్టీఆర్ కీలక నిర్ణయం.. ఇక సినిమాలకు బ్రేక్.. ఎందుకంటే?
జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎంతటి క్రేజీ దక్కించుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గ్లోబల్ స్టార్ గా కీర్తి పొందుతున్నారు. దీంతో ఎన్టీఆర్ నుంచి రాబోయే చిత్రాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో ప్రకటించిన విధంగానే ఎన్టీఆర్ తన మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్ ను చకచకా పూర్తి చేస్తున్నారు. చివరిగా జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర పార్ట్ 1 చిత్రంతో అలరించిన సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం మంచి వసూళ్లను సాధించింది. 500 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
కానీ దేవర పార్ట్ 1 చిత్రం ఎన్టీఆర్ అభిమానులను, ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయినప్పటికినీ ఆడియన్స్ ఊహించిన స్థాయిలో ఎన్టీఆర్ నుంచి సినిమా పడలేదనే ఫిర్యాదు మాత్రం ఉంది. ఇక దీంతో ఎన్టీఆర్ తన రాబోయే చిత్రాలపై మరింత శ్రద్ధ వహిస్తున్నారు. మాస్ యాక్షన్, సాలిడ్ సబ్జెక్టుతో వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ఎన్టీఆర్ లైన్ అప్ లోను భారీ చిత్రాలు సెట్ చేయబడ్డాయి. క్రేజీ డైరెక్టర్లతో చిత్రాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారంటు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ లోగా ఎన్టీఆర్ ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నారంటూ ఇండస్ట్రీలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దేవర పార్ట్ 2 తర్వాత తన రెగ్యులర్ సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. దానికి ఒక కారణం ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ఇకపై తన తాత, ఏపీ మాజీ సీఎం, నటసార్వభౌమ, దివంగత నందమూరి తారక రామారావు చిత్రాలను రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. అందుకే సినిమాలకు గ్యాప్ ఇవ్వాలని అనుకుంటున్నారు అంట. ఇక తాత నందమూరి తారక రామారావు ప్రతి జానర్ లో సినిమా చేశారు. అందులో పౌరాణికం, సోషల్, ఫ్యామిలీ, యాక్షన్, కామెడీ, ప్రభుత్వ వ్యవస్థలను వివరించే సినిమాలను చేసిన సంగతి తెలిసిందే. ఆ చిత్రాల్లో ఈ తరం ప్రేక్షకులు కూడా ఫిదా ఏ సినిమాలు ఉన్నాయి.
పౌరాణికంలో దాన వీర శూర కర్ణ, శ్రీకృష్ణ పాండవీయం, లవకుశ, ఫ్యామిలీలో గుండమ్మ కథ, మాయాబజార్, పెళ్లి చేసి చూడు, మిస్సమ్మ, పాతాళ భైరవి, యమగోల, బొబ్బిలి పులి, మేజర్ చంద్రకాంత్ వంటి ఎన్నో చిత్రాలు ఉన్నాయి. నీ చిత్రాలన్నీ ఇప్పటికీ ప్రేక్షకులకు నచ్చదగేవిగా ఉండడం విశేషం. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ తన తాత ఎన్టీ రామారావు నటించిన చిత్రాల్లో ఎలాంటి సినిమాలు రీమేక్ చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. అసలు ఇప్పుడు తాత సినిమాలను రీమేక్ చేయాలనే ఆలోచన కూడా ఎన్టీఆర్ కు ఎందుకు వచ్చింది అనేది కూడా హాట్ టాపిక్ గా మారింది.
ఎన్టీ రామారావు నటించిన బ్రహ్మర్షి విశ్వామిత్ర, రామాయణం వంటి పౌరాణిక చిత్రాల్లో జూనియర్ ఎన్టీఆర్ తాతతో కలిసి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. అప్పట్లో ఆయన పాత్రలకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది. కాగా ఈ రీమేక్ నిర్ణయం పైన ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ తన తాత నటించిన చిత్రాలలో ఎలాంటి సినిమాలు తీసుకొస్తారనేది చూడాలి. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 31 చిత్రంలో నటిస్తున్నారు. మరోవైపు బాలీవుడ్ లో రూపుదిద్దుకుంటున్న వార్ 2లోనూ సాలిడ్ రోల్ లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











