Don't Miss!
- News నామినేషన్ల పర్వంలో టీడీపీకి ఊహించని షాక్
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
జూ ఎన్టీఆర్ కి అటు చూస్తే గొయ్య..ఇటు చూస్తే..
తెలంగాణ, సమైఖ్యాంద్ర ఉద్యమాల ఎఫెక్టుతో జూ ఎన్టీఆర్ కి కొత్త చిక్కు వచ్చి పడింది. మొదట ఆయన లేటెస్టు చిత్రం అదుర్స్ ని ఈ రాజకీయ అస్ధిమిత పరిస్ధితుల్లో రిలీజ్ చేయకుండా ఆపుదామనుకున్నారు. కానీ అలా ఆపుచేస్తే..జనవరి నెల వచ్చేస్తుంది. జనవరి నెల మొదటి నుంచీ ఎన్టీఆర్ కు సెంటిమెంట్ గా వర్కవుట్ కావటం లేదు. నాగ,నా అల్లుడు, ఆంద్రావాలా చిత్రాలు సంక్రాంతికి రిలీజ్ చేసి దెబ్బతినటంతో ఎన్టీఆర్ శ్రేయాభిలాషులు, అభిమానులు అప్పుడు వద్దంటున్నారు. పోనీ డిసెంబర్ లో రిలీజ్ చేద్దామా అంటే తెలంగాణాలో రిలీజ్ చెయ్యటానికి వీలు లేదు.దాంతో కొంత మంది డిసెంబర్ 31 న రిలీజ్ చేస్తే ఈ లోగా ఈ తెలంగాణ వేడీ తగ్గచ్చు..జనవరి నెల సెంటిమెంటు తప్పుతుందని సలహా ఇస్తున్నారు. అయితే ఇప్పటివరకూ జూ.ఎన్టీఆర్ గానీ, వివివినాయిక్ గానీ, నిర్మాతలు వల్లభనేని వంశీ, నానిలు గానీ ఎవరూ ఈ తదుపరి రిలీజ్ డేట్ పై స్పష్టమైన ప్రకటన చెయ్యలేదు.
అయితే అదుర్స్ చిత్రం గురించి ఎన్టీఆర్ మాత్రం చాలా ధీమాగా ఉన్నట్లు సమాచారం. అందులోనూ ఆది వంటి సూపర్ హిట్ ఇచ్చిన వినాయిక్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం కావటంతో బయిటా మంచి అంచనాలే ఉన్నాయి. దేవీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రానికి కోనవెంకట్ కథ-మాటలు అందించారు. నయనతార, షీలా హీరోయిన్స్ గా చేస్తున్నారు. అలాగే మహేష్ ముంజ్రేకర్ విలన్ గా చేసారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో సాయాజీ షిండే, నాజర్, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు తదితరులు నటిస్తున్నారు. ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ, ఆనంద సాయి కళాదర్శకత్వం వహిస్తున్నారు. కొడాలి నాని చిత్ర సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.