twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జూ ఎన్టీఆర్ కి 'చిరంజీవి' తెలియదు కానీ..'మెగాస్టార్' తెలుసు!

    By Sindhu
    |

    చిరంజీవి మొదట క్యారెక్టర్ యాక్టర్ తర్వాత విలన్ తర్వాత మెగాస్టార్ గా ఎదగడానికి ఎంత కష్టపడ్డాడో అందరికీ తెలిసిన విషయమే. అప్పట్లో ఎఎన్ ఆర్, ఎన్టీఆర్ వారసులుగా చెప్పుకొనే నాగార్జున, బాలయ్యలాగా కాకుండా తన స్వశక్తితో సినిమా ఇండస్ట్రీలో తన కుంటూ ఒక ఇమేజ్ ని ఏర్పరచుకొన్నటువంటి వ్యక్తి చిరంజీవి. ప్రస్తుతం ఆ మెగాస్టార్ స్థానం కొసం పోటి జరుగుతున్న విషయం తెలిసిందే..అయితే అంతకు ముందు చిరంజీవి అంటే ఎవరో తెలియదు అని పలికిన జూ ఎన్టీఆర్..తాజాగా చిరంజీవి చిత్రాలనే పట్టుకుని ఊగుతున్నాడు. ప్రస్తుతం చేస్తున్న 'శక్తి" చిత్రం మరో జగదేకవీరుడు అతిలోకసుందరి అవుతుందని నిర్మాత అశ్వనీదత్ పలికినప్పుడైనా చిరంజీవి అంటే ఏమిటో జూనియర్ కి తెలిసి ఉండాలి.

    అయినా నందమూరి వంశం వాడినని పైకి చెప్పినా..జూనియర్ కి లోలోపల మాత్రం చిరంజీవిలా తెలుగుచలనచిత్ర పరిశ్రమలో స్థిరపడి పోవాలని కోరికట. అందుకే చిరు మెగాస్టార్ గా ఎదిగిన తీరును ఎప్పుడు గుర్తుకు చేసుకుంటూ తీయబోయే చిత్రాలు కూడా అలా ఉండాలని అంటుంటాడని అతనికి అత్యంత సన్నిహితులు తెలుపుతున్నారు..ఏదీఏమైనా పోటీ ముఖ్యమే కానీ..అది స్పోర్టివ్ స్పిరిట్ గా ఉండాలని పెద్దలు చెబుతుంటారు. ఈ మద్య టాలీవుడ్ కళాకారులంతా అలానే భావిస్తూ చక్కగా కలిసి మెలసి ఉండటం ప్రేక్షకులకి ఆనందాన్ని కలిగిస్తుంది.

    జూ ఎన్టీఆర్ కి సింహాద్రి సినిమా మంచి హిట్ ఇవ్వడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూ ఎన్టీఆర్ కి క్రేజి పెరిగింది. ఈ సినిమా సక్సెస్ సందర్బంగా టీవీ ఇంటర్వ్యూ జరిగింది. అప్పుడు యాంకర్ మీ ఫ్యావరెట్ హీరో 'చిరు" నా అడిగితే అందుకు సమాధానంగా ఆయనెవరో నాకు తెలియదు అని చెప్పాడట. మెగాస్టార్ అంటే ఎవరో తెలియదని ఒకప్పుడు చెప్పినా..ఇప్పుడు చిరు చేసిన చిత్రాలను నాకు చేయాలని ఉంది..అంటూ చెప్పడం చూస్తుంటే త్వరలో పరిశ్రమలో వంశ వృక్షాలు కూలిపోనున్నాయనే సందేశం వస్తుందని పరిశ్రమ పండితుల జోష్యం చెబుతున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X