తెలుగు సినిమాలో సంచలనం: హాలీవుడ్‌లోకి జూనియర్ ఎన్టీఆర్.. ఇండో అమెరికన్ డైరెక్టర్‌తో మంతనాలు

యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్ డెలివరీ, పాటలు ఇలా అన్ని విభాగాల్లోనూ రాణిస్తూ తెలుగు సినీ ఇండస్ట్రీలోనే ఆల్‌రౌండర్‌గా వెలుగొందుతున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. బడా ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ప్రవేశించినప్పటికీ.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న తారక్.. చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరో అయ్యాడు. ఇక, ఇటీవల ఫుల్ ఫామ్‌లో ఉన్న అతడు.. వరుసగా భారీ చిత్రాల్లోనే నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ త్వరలో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని ఓ న్యూస్ లీకైంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం!

ఏకంగా ఐదు విజయాలతో ఎన్టీఆర్ సత్తా

ఏకంగా ఐదు విజయాలతో ఎన్టీఆర్ సత్తా

చాలా కాలం పాటు ఫ్లాపుల పరంపరతో ఇబ్బందులను ఎదుర్కొంటూ వచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. ఇలాంటి పరిస్థితుల్లో డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'టెంపర్' అతడు హిట్ ట్రాక్ ఎక్కాడు. అక్కడి నుంచి వెనుదిరిగి చూడని తారక్.. ఆ తర్వాత వరుసగా 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్', 'జై లవ కుశ', 'అరవింద సమేత.. వీరరాఘవ' వంటి హిట్లను ఖాతాలో వేసుకున్నాడు.

మెగా హీరోతో కలిసి... ప్రతిష్టాత్మక చిత్రం

మెగా హీరోతో కలిసి... ప్రతిష్టాత్మక చిత్రం

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న RRR (రౌద్రం రణం రుధిరం)లో రామ్ చరణ్‌తో కలిసి నటిస్తున్నాడు. అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత కథల ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇందులో చరణ్.. అల్లూరిలా, ఎన్టీఆర్.. కొమరం భీంలా నటిస్తన్నారు.

రెండోసారి కలవబోతున్న యంగ్ టైగర్

రెండోసారి కలవబోతున్న యంగ్ టైగర్

'అరవింద సమేత.. వీరరాఘవ' వంటి సూపర్ డూపర్ హిట్‌ తర్వాత జూనియర్ ఎన్టీఆర్.. త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి ఓ సినిమాను ప్రకటించాడు. హారిక హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై రాధాకృష్ణ, నందమూరి కల్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు 'అయిననూ పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.

ఎన్టీఆర్ తర్వాతి సినిమాపై క్లారిటీ లేదు

ఎన్టీఆర్ తర్వాతి సినిమాపై క్లారిటీ లేదు

ప్రస్తుతం RRR, ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమాలు చేయనున్న జూనియర్ ఎన్టీఆర్.. దీని తర్వాత ఎవరితో కలవబోతున్నాడన్న దానిపై ఎన్నో ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రశాంత్ నీల్, అట్లీ, లోకేష్ కనగరాజ్ సహా ఎంతో మంది పేర్లు తెరపైకి వచ్చాయి. అదే సమయంలో కొందరు బాలీవుడ్ డైరెక్టర్ పేర్లూ వినిపించాయి. కానీ, ఈ విషయంలో క్లారిటీ మాత్రం రాలేదు.

హాలీవుడ్‌లోకి జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ

హాలీవుడ్‌లోకి జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ

వరుస విజయాలను అందుకుంటూ దూసుకుపోతోన్న జూనియర్ ఎన్టీఆర్ గురించి తాజాగా ఓ సెన్సేషనల్ న్యూస్ బయటకు వచ్చింది. ప్రస్తుతం వైరల్ అవుతోన్న సమాచారం ప్రకారం.. తారక్ త్వరలోనే ఇంగ్లీష్ సినిమాలో నటించబోతున్నాడట. ఈ చిత్రం ద్వారా అతడు నేరుగా హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని అంటున్నారు. దీంతో అతడి ఫ్యాన్స్ దీన్ని ట్రెండ్ చేస్తున్నారు.

ఇండో అమెరికన్ డైరెక్టర్‌తో మంతనాలు

ఇండో అమెరికన్ డైరెక్టర్‌తో మంతనాలు

భారతీయ సంతతికి చెందిన హాలీవుడ్ డైరెక్టర్ మనోజ్ నైట్ శ్యామలన్ తెరకెక్కిచబోతున్న ఓ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. సదరు దర్శకుడు గతంలో 'ది సిక్స్త్ సెన్స్', 'అన్‌బ్రేకబుల్', 'సైన్స్', 'స్ప్లిట్', 'ఆఫ్టర్ ఎర్త్', 'ద విజిట్', 'గ్లాస్' వంటి సినిమాలను తెరకెక్కించాడు. ఇవన్నీ సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X