దాసరితో దాగుడు మూతలు ఆడుతున్న జూ ఎన్టీఆర్...
జూ ఎన్టీఆర్ యంగ్ టైగర్ ిన సినీ పరిశ్రమలో పిలుస్తారు. సినిమా టైటిల్ లో కూడా యంగ్ టైగర్ అని పడుతుంది. యంగ్ టైగర్ గా పిలువబడే జూ ఎన్టీఆర్ కు ఈ టైటిల్ కరెక్టుగానే సరిపోయింది. ఎన్టీఆర్ ప్రవర్తనకు ఈ టైటిల్ సరిపోతుంది. ఎన్టీఆర్ డైనామిక్ గా కొన్ని నిర్ణయాలు తీసుకోవటం, దానిక తగ్గట్టు అతను ధైర్యాన్ని ప్రదర్శించటం మనకు తెలుసు. అటువంటి యంగ్ టైగర్ ఇప్పుడు ఒక వ్యక్తికి కనబడకుండ తిరుగుతున్నాడు. ఆ వ్యక్తి పేరెత్తితేనే వెన్నులో వణుకు పుడుతోందట. ఆ భయంతో ఎన్టీఆర్ ఆ వ్యక్తి కనబడితే పారిపోతున్నాడట.
ఇంతకీ ఆ వ్యక్తి ఎవరన్నది మీరందరూ ఊహించే ఉంటారు. ఇంకెవరో కాదు అతడే, దాసరి నారాయణరావు".బాలయ్య తో పరమవీర చక్ర తీసి పెద్ద ఫ్లాప్ డైరక్టర్ అనిపించుకొంటోన్న దాసరి, తన 151 సినిమా జూ ఎన్టీఆర్ తీస్తేనని చెప్పటంతో జూ ఎన్టీఆర్ కు నిద్రలేకుండా పోయిందట. పొరపాటున దాసరి తను అన్న ప్రకారం ఎన్టీఆర్ తో సినిమా తీస్తానని అంటాడేమోనని భయంతో గడగడ వణుకుతున్నాడని ఎన్టీఆర్ సన్నిహితులు చెబుతున్నారు. ఎన్టీఆర్ కూడా దాసరితో దూరంగా ఉండి, అందకుండ చిక్కడు దొరకుడు మాదిరి దాగుడు మూతలు ఆడుతూ తెలివిగా ఉంటున్నాడని, సినీ పరిశ్రమ చెప్పుకుంటుంది.


Click it and Unblock the Notifications











