నాగచైతన్య లవర్స్ మీదే జూ. ఎన్టీఆర్ కన్ను
ఎన్టీఆర్ చాలా విచిత్రమైన స్టాటజీని ఫాలో అవుతున్నారు. నాగచైతన్య సరనస హీరోయిన్స్ గా చేసిన అమ్మాయిలనే పట్టుబట్టి తన ప్రక్కన తీసుకుంటున్నాడు. అదే కోవలో ..ఇప్పుడు జూ.ఎన్టీఆర్ ఆలోచన అంతా ఇప్పుడు అమలా పౌల్ మీద ఉంది. నాన్న చిత్రంలో విక్రమ్ తో చేసిన అమలా పౌల్ ఆ తర్వాత నాగచైతన్య సరసన బెజవాడ లో చేస్తోంది. బెజవాడ స్టిల్స్ చూసిన ఎన్టీఆర్ ఆమెకు తవ సినిమాలో ఆఫర్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాడు. నాగచైతన్య తో ఏమి మాయ చేసావేలో చేసిన సమంతను తన తదుపరి బృందావనంలో తీసుకున్న ఎన్టీఆర్ ఆ తర్వాత వెంటనే నాగచైతన్య 100 పర్శంట్ లవ్ లో చేసిన తమన్నాను తన తాజా చిత్రం ఊసరవిల్లిలో తీసుకున్నాడు. అలా నాగచైతన్య హీరోయిన్స్ ని వరసగా తన ప్రక్కన తీసుకుంటున్న ఎన్టీఆర్ త్వరలోనే అమాలా పౌల్ ని తన సినిమా లోకి తీసుకుంటారని చెప్త్తున్నారు.ఇక ''దుర్మార్గులను అంతం చేయాడానికి ఒక్కోసారి దుర్మార్గుడిలా మారాల్సిన పరిస్థితి వస్తుంది. తను పుట్టి పెరిగిన 'బెజవాడ' జోలికొస్తే ఎంతటివారినైనా ఎదిరించేందుకు సిద్ధమైన యువకుడి కథ 'బెజవాడ'. ఆ యువకుడుగా నాగచైతన్య కనిపిస్తారు.అలాగే ఎవరైనా సరే పుడుతూనే కత్తి పట్టుకొని పగతో రగిలిపోరు. పరిస్థితులే వాళ్లలో కక్షల్నీ, కార్పణ్యాల్నీ పెంచుతాయి. మా కథలోని యువకుడు ఏ కారణాలతో రౌడీగా మారాల్సి వచ్చింది. అతని లక్ష్యం ఏమిటి అన్నది తెర మీదే చూడాలి నాగచైతన్య నటన తప్పకుండా మాస్ ప్రేక్షకులకు నచ్చుతుందన్నారు దర్శకుడు వివేక్‌కృష్ణ. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'బెజవాడ'. రామ్‌గోపాల్ వర్మ, కిరణ్‌కుమార్ కోనేరు నిర్మాతలు. ఈ నెల 12 నుంచి స్విట్జర్లాండ్‌లో పాటలు చిత్రిస్తారు.


Click it and Unblock the Notifications











