twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్: ఎన్టీఆర్ చేసిన ఆ సీన్ హాలీవుడ్ మూవీని గుర్తు చేస్తుందట.!

    By Manoj Kumar P
    |

    Recommended Video

    Jr NTR Action Scene With Tiger In RRR Remembers A Hollywood Movie

    తెలుగు సినీ ఇండస్ట్రీలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న చిత్రం 'RRR'. దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ఈ మూవీలో టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ కలిసి నటిస్తున్నారు. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో లండన్ థియేటర్ ఆర్టిస్టు ఒలీవియా మోరిస్, బాలీవుడ్ భామ ఆలియా భట్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరితో పాటు పలువురు ప్రముఖులు కీలక పాత్రలు చేస్తున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తాజాగా బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా న్యూస్.?

    ఇద్దరు యోధుల కథగా వస్తోంది

    ఇద్దరు యోధుల కథగా వస్తోంది

    ‘బాహుబలి' వంటి సూపర్ హిట్ సిరీస్ తర్వాత ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రమే RRR. ఇందులో తారక్.. కొమరం భీమ్‌గా, చరణ్.. అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ఈ ఇద్దరు యోధులు పోరాటం చేయడానికి ముందు జరిగిన అంశాలకు ఊహాజనితమైన సన్నివేశాలను జోడించి దీనిని రూపొందిస్తున్నారు. అంటే తెలియని అంశాలను చూపించబోతున్నారన్న మాట.

    చాలా అయినా.. వాళ్లకు మాత్రం నిరాశే

    చాలా అయినా.. వాళ్లకు మాత్రం నిరాశే

    ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమై ఇప్పటికే ఏడాది పైగా అయిపోయింది. అంతేకాదు, దీనికి సంబంధించిన డెబ్బై శాతం షూటింగ్ కూడా పూర్తయిపోయింది. అయినప్పటికీ ఈ మూవీకి సంబంధించిన ఒక్క పోస్టర్ గానీ, సాంగ్ కానీ మరే ఇంతర అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ ఇవ్వలేదు. దీంతో అటు మెగా ఫ్యాన్స్.. ఇటు నందమూరి అభిమానులు నిరాశ చెందుతున్నారు.

    ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఫలితం లేదు

    ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఫలితం లేదు

    గతంలో ‘బాహుబలి' సినిమా షూటింగ్ జరుపుకుంటున్న సమయంలో చాలా భాగం సినిమా లీక్ అయింది. అలాగే, పలు ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. దీంతో RRR విషయంలో జక్కన్న ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అయినప్పటికీ ఈ సినిమాలోని జూనియర్ ఎన్టీఆర్ లుక్, వీడియో రివీల్ అయిపోయాయి. అలాగే, ఇటీవల మరో సీన్ కూడా లీక్ అయిపోయింది.

    RRR నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

    RRR నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

    ఈ సినిమాలో కొమరం భీమ్‌గా నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్.. ఇంట్రడక్షన్ సీన్‌లో పులితో పోరాటం చేస్తాడని ఆ మధ్య ప్రచారం జరిగింది. దానికి బలం చేకూర్చుతూ నాలుగు రోజుల క్రితం వీడియో బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సీన్ సినిమాలో హైలైట్‌గా నిలుస్తుందట. ఇప్పటికే ఈ ఫైట్ సీన్‌కు సంబంధించిన గ్రాఫిక్ వర్క్ కూడా పూర్తయిందని అంటున్నారు.

    ఆ సీన్ హాలీవుడ్ మూవీని గుర్తు చేస్తుందట.!

    ఆ సీన్ హాలీవుడ్ మూవీని గుర్తు చేస్తుందట.!

    అంతేకాదు, ఈ సీన్ గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ కూడా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. పులితో పోరాటానికి సంబంధించిన సీన్‌ను బల్గేరియాలో తెరకెక్కించారట. గతంలో వచ్చిన హాలీవుడ్ మూవీ ‘300 యోధులు'లో హీరో తోడేలుతో పోరాడుతాడు. దాని స్పూర్తిగానే RRRలో ఆ సీన్ పెట్టారనే టాక్ వినిపిస్తోంది. దీంతో నందమూరి ఫ్యాన్స్‌లో ఆసక్తి రెట్టింపు అయింది.

    English summary
    Tollywood Young Hero Jr Ntr Upcoming Movie Is RRR. This Movie Directed By SS Rajamouli. In This Movie mega power Star Ram charan Also Working. In This Movie Will be Released on july 30 2020.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X