Taraka Ratna: సోదరుడికి ఎన్టీఆర్ సహాయం.. అన్ని లక్షలు పంపించి మరీ.. లీకైన సంచలన నిజం

టాలీవుడ్‌కు చెందిన ఫేమస్ యాక్టర్ నందమూరి తారకరత్న కుప్పంలో జరిగిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలో అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. కొద్ది దూరం నడిచిన ఆయన అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయారు. ఇది గుండెపోటు అని గుర్తించిన వైద్యులు చికిత్సను అందించారు. అలా 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న శనివారం సాయంత్రం తుది శ్వాసను విడిచారు. ఈ నేపథ్యంలో గతంలో తారకరత్నకు జూనియర్ ఎన్టీఆర్ ఆర్థిక సహాయం చేశాడని ఓ వార్త ఫిలిం నగర్‌లో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే...

సొంత ఇంటికి భౌతికకాయం

సొంత ఇంటికి భౌతికకాయం

ఇటీవలే గుండెపోటుకు గురై బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో 23 రోజుల పాటు చికిత్స తీసుకున్న నందమూరి తారకరత్న శనివారం సాయంత్రం తుది శ్వాసను విడిచారు. ఆ వెంటనే ఆయన భౌతికకాయాన్ని అక్కడి నుంచి హైదరాబాద్‌ శివారు ప్రాంతమైన శంకర్‌పల్లిలోని అతడి నివాసానికి తీసుకు వచ్చారు. ఆదివారం మొత్తం అక్కడే ఉంచారు.

ఫిలిం చాంబర్‌కు తరలింపు

ఫిలిం చాంబర్‌కు తరలింపు

ఆదివారం మొత్తం సొంత ఇంటిలోనే తారకరత్న పార్ధీవ దేహాన్ని ఉంచిన కుటుంబ సభ్యులు.. సోమవారం ఉదయం ఫిలిం నగర్‌లోని ఫిలిం చాంబర్‌కు తరలించారు. అక్కడ అభిమానుల సందర్శనార్థం మధ్యాహ్నం వరకూ ఉంచారు. ఈ క్రమంలోనే ఎంతో మంది ప్రముఖులు, సామాన్యులు నందమూరి తారకరత్న భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.

మహా ప్రస్థానంలో ఫ్యామిలీ

మహా ప్రస్థానంలో ఫ్యామిలీ

ఫిలిం చాంబర్‌ నుంచి తారకరత్న పార్ధీవ దేహాన్ని నేరుగా జూబ్లీహిల్స్‌లో ఉన్న మహా ప్రస్థానానికి అంతిమ యాత్రగా తరలించారు. ఆ సమయంలో నందమూరి కుటుంబ సభ్యులతో పాటు హీరోలు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లు కూడా ఉన్నారు. అంతేకాదు, టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్‌తో పాటు ఎంతో మంది రాజకీయ నేతలు కూడా వాళ్లతో నడిచారు.

తారకరత్న అంత్యక్రియలు

తారకరత్న అంత్యక్రియలు

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో ఉన్న మహా ప్రస్థానంలో నందమూరి తారకరత్న అంత్యక్రియలు కొద్ది సేపటి క్రితమే పూర్తి అయ్యాయి. బాలకృష్ణతో పాటు పలువురు కుటుంబ సభ్యులు తారకరత్న పాడెను మోస్తూ తీసుకెళ్లారు. అనంతరం తండ్రి మోహనకృష్ణ అశ్రునయనాల నడుమ తారకరత్న చితికి నిప్పు అంటించారు. దీంతో ఆ ప్రాంగణమంతా విషాద ఛాయలు అలముకున్నాయి.

ఎన్టీఆర్ సహాయం చేశాడని

ఎన్టీఆర్ సహాయం చేశాడని

ఇటీవలే గుండెపోటుకు గురైన నందమూరి తారకరత్న.. 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఓడిన తర్వాత ఆయన గురించి ఎన్నో రకాల వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్.. తన సోదరుడు తారకరత్నకు ఆర్థిక సహాయం చేయడంతో పాటు భరోసా కల్పించాడని ఇప్పుడు ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది.

ఇష్టం లేని పెళ్లి కారణంగా

ఇష్టం లేని పెళ్లి కారణంగా

నందమూరి తారకరత్న వివాహం అలేఖ్య రెడ్డితో జరిగింది. అంతకు ముందే ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి జరగడంతో నందమూరి కుటుంబం వీళ్ల మ్యారేజ్‌కు ఒప్పుకోలేదు. దీంతో వీళ్లిద్దరూ 2012 ఆగష్టు 2న సంఘీ టెంపుల్‌లో సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఆ సమయంలో తారకరత్న ఆర్థికంగా, మానసికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డాడని ఇండస్ట్రీలో ప్రచారం జరిగింది.

అన్ని లక్షలు పంపించాడా

అన్ని లక్షలు పంపించాడా

ఇష్టం లేని పెళ్లి చేసుకున్న తర్వాత నందమూరి తారకరత్న పడుతోన్న ఇబ్బందులు తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్.. అతడికి స్వయంగా రూ. 6 లక్షలు పంపించాడని ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అంతేకాదు, ఒక సందర్భంలో స్వయంగా కలిసి సోదరుడికి భరోసా కల్పించేలా మాట్లాడాడట. ఈ విషయాన్ని తారకరత్న కూడా పలుమార్లు పరోక్షంగా వెల్లడించాడని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X