పాన్ ఇండియా దర్శకులను కాదని.. F2 దర్శకుడితో RRR హీరో చర్చలు.. కామెడీతో ప్రయోగం?
మొత్తానికి టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మరో ఇద్దరు హీరోలు పాన్ ఇండియా మార్కెట్ ను క్రియేట్ చేసుకుంటున్నారు. RRR సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి సినిమా అనంతరం తెరకెక్కించిన ఈ సినిమా గతంలో ఎప్పుడూ లేనివిధంగా పాన్ ఇండియా బాక్సాఫీస్ హిస్టరీలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది.
ఇక ఈ సినిమాలో అనంతరం ఈ ఇద్దరు హీరోలు ఎలాంటి సినిమాలతో సంచలనం సృష్టిస్తున్నారు అనేది ఆసక్తిగా మారింది. రీసెంట్ గా ఈ హీరోలలో ఒకరు అనిల్ రావిపూడి తో సినిమా చేసే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. చర్చలు కూడా కొనసాగుతున్నట్లు సమాచారం. ఇంతకీ హీరో ఎవరు ఆ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతోంది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని వివరాల్లోకి వెళితే..

RRRతో బిగ్ మార్కెట్
జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటించగా.. అల్లూరి సీతారామరాజు పాత్ర లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన RRR సినిమా మొత్తానికి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా ద్వారా ఇద్దరు హీరోలు తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి పాన్ ఇండియా మార్కెట్లో వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నారు.

తొందరపడకుండా..
ప్రభాస్ అల్లు అర్జున్ అనంతరం ఇప్పుడు రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కూడా బాలీవుడ్లో అగ్ర నిర్మాతలతో అలాగే స్టార్ దర్శకులతో కూడా సినిమాలు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ కు అలాగే రామ్ చరణ్ కు బాలీవుడ్ ప్రముఖుల నుంచి ఆఫర్ వస్తున్నట్లు సమాచారం. కానీ ఈ సమయంలో తొందరపడి కథలను సెలెక్ట్ చేసుకోకుండా చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి అని ఇద్దరు హీరోలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

అలా సెట్ చేసిన దిల్ రాజు
ఇక అనిల్ రావిపూడి కూడా RRR హీరోతో వర్క్ చేయబోయే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక ఆ హీరో మరెవరో కాదు. జూనియర్ ఎన్టీఆర్ అని తెలుస్తోంది. నిర్మాత దిల్ రాజు అనిల్ రావిపూడి కలయికలో మరో సినిమా రానుంది. అయితే అంతకు ముందు జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు దిల్ రాజు డీల్ సెట్ చేసుకోగా ఇప్పుడు అనిల్ రావిపూడిని ఎన్టీఆర్ ను కలిపేందుకు దిల్ రాజు మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

ఒకవైపు చరణ్.. మరోవైపు ఎన్టీఆర్
రామ్ చరణ్ తేజ్ తో దిల్ రాజు ప్రస్తుతం ఒక సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. తమిళ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై అంచనాలు బాగానే ఉన్నాయి. ఇక జూనియర్ ఎన్టీఆర్ తో కూడా దిల్ రాజు ఒక సినిమా చేయాలని చూస్తున్నాడు. అందుకే అనిల్ రావిపూడిని లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది.
Recommended Video


ఆ కాంబో ఎప్పుడంటే..
ప్రస్తుతం F2 సినిమా ఫ్రాంచైజ్ ను కొనసాగిస్తూ F3 సినిమాను తెరకెక్కిస్తున్న అనిల్ రావిపూడి ఆ సినిమా అనంతరం ఈ ఏడాదిలోనే బాలకృష్ణ తో ఒక సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు. ఇక ఆ తర్వాత 2003 సంవత్సరం అనంతరం జూనియర్ ఎన్టీఆర్తో సినిమా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక ఆ ఎడాది చివరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావచ్చని సమాచారం. ప్రస్తుతం బాలీవుడ్ నుంచి ఎన్టీఆర్ కు మంచి ఆఫర్స్ వస్తున్నప్పటికీ అతను అనిల్ రావిపూడి తో కామెడీ జానర్ లో సినిమా చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి ఆ ప్రయోగం ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











