ఎన్టీఆర్ పెళ్ళికి బంగారు చొక్కా గిప్టు ఇస్తోందెవరంటే....
త్వరలో జరగబోయే జూ.ఎన్టీఆర్ పెళ్ళికి అప్పుడే గిప్టులు రావటం ప్రారంభమయ్యాయి. తాజాగా హైదరాబాద్ కుకుట్ పల్లిలో ప్రారంభమైన వైష్ణవి జ్యూయిలర్స్ వారు ఎన్టీఆర్ కి పెళ్ళికోసం ఓ బంగారు చొక్కా రెడీ చేసింది. పూర్తిగా బంగారంతో తయారైన ఈ చొక్కాని నొవోటల్ హోటల్ లో ఎన్టీఆర్ ఆవిష్కరించనున్నట్లు సమాచారం. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం బృందావనం,శక్తి చిత్రాల్లో నటిస్తున్నారు. బృందావనం చిత్రాన్ని దిల్ రాజు నిర్మాతగా వంశీ పైడిపల్లి రూపొందిస్తున్నారు. శక్తి చిత్రాన్ని..అశ్వనీదత్ నిర్మాతగా మెహర్ రమేష్ డైరక్ట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











