‘గాడ్ ఆఫ్ వార్' మళ్లీ షాక్ ట్విస్ట్.. త్రివిక్రమ్ ప్లాన్ ఏంటి?

టాలీవుడ్‌లో మరో భారీ మైథలాజికల్ ప్రాజెక్ట్ 'గాడ్ ఆఫ్ వార్(God of war)' చుట్టూ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. "కుమారస్వామి" కథ ఆధాకరంగా ఈ సినిమాని ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్నారు. అయితే, గత కొంతకాలంగా హీరోల మార్పులతో వార్తల్లో నిలుస్తోంది. మొదట ఈ ప్రాజెక్ట్‌ను అల్లు అర్జున్ (Allu Arjun)తో చేయాలని భావించిన త్రివిక్రమ్, 'పుష్ప-2' తర్వాత ఈ సినిమా స్టార్ట్ అవుతుందని అనుకున్నారు. కానీ అనూహ్యంగా బన్నీ అట్లీ ప్రాజెక్ట్‌తో బిజీ కావడంతో ఈ సినిమా జూనియర్ ఎన్టీఆర్ ( Jr NTR) వద్దకు వెళ్లింది.ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా త్రివిక్రమ్ గ్రాండ్ ట్రీట్ ఇవ్వబోతున్నారంట. ఇంతకీ సెన్సేషన్ సర్పైజ్ ఏంటీ?

గాడ్ ఆఫ్ వార్ అనౌన్స్ మెంట్ నుంచి ఊహించని ట్విస్టులు చోటు చేసుకుంటాయి. మొదట ఈ ప్రాజెక్ట్ మళ్లీ అల్లు అర్జున్ దగ్గరకు వెళ్లిందనే వార్తలు వైరల్ అయ్యింది. దీంతో "కుమారస్వామి పాత్రలో చివరకు ఎవరు నటిస్తారు?" అనే ప్రశ్న ఫ్యాన్స్‌లో ఆసక్తి రేకెత్తించింది. కానీ, తాజా సమాచారం ప్రకారం అన్ని ఊహాగానాలకు తెరదించి ఈ సినిమా మళ్లీ ఎన్టీఆర్ చేతికే వచ్చి ఫైనల్ అయింది. త్రివిక్రమ్-ఎన్టీఆర్ మధ్య ఇటీవల జరిగిన మీటింగ్ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.

Jr NTR God of War Announcement on May 20 Trivikram Mythological Film Update Buzz

ఇది కొత్త విషయం కాదు. గతంలో కూడా ఇలాంటి పరిస్థితులు చాలానే చోటుచేసుకున్నాయి. 'దేవర' సినిమా విషయంలో కూడా ఇదే తరహా పరిణామాలు జరిగాయి. మొదట ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్‌లో అనౌన్స్ అయిన ప్రాజెక్ట్, మధ్యలో అల్లు అర్జున్ వద్దకు వెళ్లి, చివరకు మళ్లీ ఎన్టీఆర్ వద్దకే చేరి 'దేవర'గా రూపుదిద్దుకుంది. ఇప్పుడు త్రివిక్రమ్ మైథలాజికల్ మూవీ విషయంలో కూడా అదే సీన్ రిపీట్ కావడం విశేషం. నిజానికి 'అరవింద సమేత' తర్వాత ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో మరో సినిమా రావాల్సి ఉంది. 2020లో అధికారిక ప్రకటన కూడా వచ్చినప్పటికీ, అది ఆచరణలోకి రాలేదు. తరువాత 2023లో త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ఈ కథ మళ్లీ అనౌన్స్ అయింది. ఇప్పుడు మళ్లీ అది ఎన్టీఆర్ వద్దకు చేరుకోవడం ఈ ప్రాజెక్ట్ ఎంత ప్రాధాన్యత కలిగిందో చూపిస్తోంది.

ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ అభిమానులకు మరింత గుడ్ న్యూస్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'డ్రాగన్' ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నాడు. అయితే మరోవైపు త్రివిక్రమ్ తెరకెక్కించే ఈ భారీ మైథలాజికల్ మూవీకి "God of War" అనే వర్కింగ్ టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ వీడియోను మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ఈ అనౌన్స్‌మెంట్ వీడియోను సాధారణంగా కాకుండా హై లెవెల్‌లో రూపొందిస్తున్నారు. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ ( VFX) విషయంలో ఎలాంటి రాజీ లేకుండా అత్యున్నత నాణ్యతతో తయారు చేయాలని టీమ్ ప్రయత్నిస్తోందట. ఇందుకోసం టెక్నికల్ టీమ్ రేయింబవళ్లు పనిచేస్తోందని తెలుస్తోంది. ఫైనల్ అవుట్‌పుట్ పట్ల మేకర్స్ పూర్తిగా సంతృప్తి చెందిన వెంటనే వీడియోను రిలీజ్ చేయనున్నారు.

ఒకవేళ అన్ని పనులు అనుకున్నట్లే పూర్తయితే, మే 20న ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా త్రివిక్రమ్ 'God of War' అనౌన్స్‌మెంట్ వీడియో విడుదల కావడం ఖాయం అని టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ఇది మాస్ ట్రీట్ మాత్రమే కాదు, నిజమైన పండగ అవుతుందని చెప్పాలి. మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్, త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, ఎన్టీఆర్ పవర్‌ఫుల్ ప్రెజెన్స్ అన్ని కలిస్తే ఈ ప్రాజెక్ట్ టాలీవుడ్‌లో మరో భారీ సంచలనంగా మారే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X