Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఎన్టీఆర్ గుడ్ బై.. అల్లు అర్జున్‌కు బంపర్ ఆఫర్?.. అసలు ఏం జరుగుతున్నదంటే..
Recommended Video
దక్షిణాదిలో బిగ్‌బాస్ రియాలిటీ షో లేటుగా స్టార్ట్ అయినా గానీ దానికి వచ్చిన స్పందన అనూహ్యం. తొలి సీజన్‌కు వచ్చిన రెస్పాన్స్‌తో రెండో సీజన్‌కు నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. తొలి సీజన్‌కు తమిళంలో విలక్షణ నటుడు కమల్ హాసన్, తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా దుమ్ము దులిపేశారు. తమిళంలో రెండో సీజన్‌కు కమల్ హాసన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, తెలుగులో మాత్రం ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించడంపై సందేహం నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ హోస్ట్ పేరు తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఎన్టీఆర్‌కు భారీ రెమ్యునరేషన్
తెలుగులో బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా వ్యవహరించినందుకు జూనియర్ ఎన్టీఆర్‌కు భారీగానే రెమ్యూనరేషన్ ఇచ్చినట్టు సమాచారం. ప్రతీ ఎపిసోడ్‌కు యంగ్టైగర్కు రూ.35 లక్షల చొప్పున చెల్లించినట్టు వార్తలు వచ్చాయి. అయితే కొత్త ప్రాజెక్టుల కారణంగా బిగ్‌బాస్ రియాలిటీషోకు ఎన్టీఆర్ దూరమవుతున్నట్టు సమాచారం.
రెండు ప్రాజెక్టులతో బిజీ
జై లవకుశ సక్సెస్ తర్వాత తదుపరి చిత్రాన్ని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఎన్టీఆర్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఆ తర్వాత వెంటనే అంటే అక్టోబర్ నెల నుంచి దర్శకుడు రాజమౌళి రూపొందించే మల్టీస్టారర్ చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్, మెగా హీరో రాంచరణ్ కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే.
బిగ్‌బాస్‌కు యంగ్ టైగర్ గుడ్‌బై
బిగ్‌బాస్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ తప్పుకొంటున్నారనే వార్తను ఓ ఆంగ్ల దినపత్రిక కథనాన్ని ప్రచురించింది. త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళి చిత్రాలను చేయడానికి ఎన్టీఆర్ ఒప్పుకొన్నారు. అవి గ్యాప్ లేకుండా వెంటవెంటనే ప్రారంభం కానున్నాయి. అందుకే బిగ్‌బాస్ రియాలిటీ షో నుంచి తప్పుకొంటున్నట్టు కథనంలో పేర్కొన్నారు.
అఫీషియల్‌గా ప్రకటన
ప్రాజెక్టుల ఒత్తిడి కారణంగా బిగ్‌బాస్ రియాలిటీ షో చేయడానికి ఎన్టీఆర్ సుముఖంగా లేనందున ప్రస్తుతం నిర్వాహకులు అల్లు అర్జున్‌తో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఈ అంశంపై అటు ఎన్టీఆర్ సైడ్ నుంచి గానీ, ఇటు అల్లు అర్జున్ ఎలాంటి స్పందన గానీ, ప్రకటన గానీ రాకపోవడంతో ఈ వార్తలో వాస్తవం ఎంత అనే విషయంపై సందిగ్ధత కొనసాగుతున్నది.
ఎన్టీఆర్ స్థానంలో అల్లు అర్జున్
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో విషయంలో ఎన్టీఆర్ తన ప్రతిభతో కొత్త ప్రమాణాలు సెట్ చేశాడన్నది వాస్తవం. ఒకవేళ నిజంగా ఎన్టీఆర్ చేయకపోతే టెలివిజన్ ప్రేక్షకులకు కొంత నిరాశే. అయితే అల్లు అర్జున్ ఒకవేళ హోస్ట్‌గా వ్యవహరిస్తే ఆ లోటును తన యాక్టివ్నెస్తో అతను పూడ్చడం జరుగుతుందనేది సినీ వర్గాల సమాచారం.