For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  NTR32: జాతీయ అవార్డు విన్నింగ్ డైరెక్టర్‌తో ఎన్టీఆర్ సినిమా.. అలాంటి కథకు ఫ్లాటైన స్టార్

  |

  బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్, పాటలు ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ సుదీర్ఘ కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్‌గా హవాను చూపిస్తున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న అతడు.. ఆ మధ్య చాలా కాలం పాటు పరాజయాల పరంపరతో ఇబ్బందులు పడ్డాడు. ఇలాంటి పరిస్థితుల్లో 'టెంపర్'తో హిట్ ట్రాక్ ఎక్కిన ఈ స్టార్ హీరో.. అప్పటి నుంచి వరుసగా 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్', 'జై లవ కుశ', 'అరవింద సమేత.. వీరరాఘవ' వంటి సూపర్ డూపర్ హిట్లను ఖాతాలో వేసుకుని ఫుల్ ఫామ్‌తో సత్తా చాటుతున్నాడు.

  మళ్లీ రెచ్చిపోయిన జాన్వీ కపూర్: పైన ఏమీ లేకుండానే అందాల ఆరబోత

  ఈ మధ్య కాలంలో వరుస విజయాలతో సత్తా చాటుతోన్న టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్.. ఇటీవలే RRR (రౌద్రం రణం రుధిరం) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలతో పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ సినిమా ఘన విజయాన్ని అందుకుంది. అంతేకాదు, ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. అదే సమయంలో ఎన్టీఆర్‌కు దేశ వ్యాప్తంగా క్రేజ్‌ను తీసుకుని వచ్చింది. ఈ ఉత్సాహంతోనే యంగ్ టైగర్ తన తదుపరి చిత్రాన్ని బడా డైరెక్టర్ కొరటాల శివతో చేయబోతున్నాడు. పాన్ ఇండియా రేంజ్‌లో రాబోయే ఈ సినిమా జూలై నుంచి ప్రారంభం కాబోతుందని చిత్ర యూనిట్ సభ్యులు వెల్లడించిన విషయం తెలిసిందే.

  Jr NTR Green Signal to Kollywood Director Vetrimaaran

  వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్ RRR మూవీ షూటింగ్ జరుగుతోన్న సమయంలోనే మరో దర్శకుడికి కూడా పచ్చజెండా ఊపేశాడు. అతడే.. కేజీఎఫ్‌తో తన స్టామినాను ప్రపంచానికి పరిచయం చేసిన ప్రశాంత్ నీల్. వీళ్లిద్దరి కాంబోలో సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇది కూడా పాన్ ఇండియా రేంజ్‌లోనే రాబోతుంది. ఇవి మాత్రమే కాదు.. జూనియర్ ఎన్టీఆర్.. 'ఉప్పెన'తో బిగ్గెస్ట్ హిట్‌ను సొంతం చేసుకున్న బుచ్చిబాబు సనతోనూ ఓ సినిమా చేయబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రాకున్నా.. ఈ ప్రాజెక్టు దాదాపుగా కన్ఫార్మ్ అయినట్లే అని అంతా అనుకుంటున్నారు.

  హాట్ షోలో హద్దు దాటిన పూజా హెగ్డే: లోదుస్తులు లేకుండా షాకింగ్ ఫోజులు

  ఇప్పటికే పలువురు డైరెక్టర్లతో సినిమాలు చేసేందుకు కమిట్ అయిన జూనియర్ ఎన్టీఆర్.. ఇప్పుడు మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయన ఎవరో కాదు.. తనదైన చిత్రాలతో ఇప్పటికే పలుమార్లు ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డులను సొంతం చేసుకున్న వెట్రిమారన్. అవును.. ఈ దర్శకుడితో తారక్ సినిమా చేయబోతున్నట్లు ఓ న్యూస్ ఫిలిం నగర్‌లో వైరల్ అవుతోంది. అంతేకాదు, తాజాగా వీళ్లిద్దరూ హైదరాబాద్‌లో కలుసుకున్నారని, ఆ సమయంలో సదరు దర్శకుడు ఓ మాస్ స్టోరీ లైన్ వినిపించాడని తెలుస్తోంది. ఇది ఎన్టీఆర్‌కు నచ్చడంతో వెంటనే ఒప్పుకున్నాడనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది.

  వాస్తవానికి వెట్రిమారన్ గతంలో 'వాడా చెన్నై', 'ఆడుకాలమ్', 'విసారణై' వంటి విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించాడు. తద్వారా దర్శకుడిగా మంచి గుర్తింపును అందుకున్నాడు. కానీ, ధనుష్ హీరోగా వచ్చిన 'అసురన్'తో అతడు అందరికీ తెలిసిపోయాడు. ఈ మూవీ చూసినప్పుడే తారక్.. వెట్రిమారన్‌తో సినిమా చేయాలని భావించాడట. అది ఇప్పటికి సెట్ అయిందని ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే ఎవరో ఒకరు స్పందించాల్సిన అవసరం ఉంది.

  English summary
  Tollywood Star Hero Jr NTR Ready to Do So Many Projects in Future. Now He Gave Green Signal to Kollywood Director Vetrimaaran.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X