పాన్ ఇండియా తెలుగు డైరెక్టర్‌తో ఎన్టీఆర్: భారీ డిజాస్టర్ వచ్చిన బ్యానర్‌లో.. అలాంటి కథతో ప్రయోగం
జూనియర్ ఎన్టీఆర్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతలా ఇతగాడు దాదాపు రెండు దశాబ్దాలుగా టాలీవుడ్‌లో తనదైన చిత్రాలతో సందడి చేస్తున్నాడు. అదే సమయంలో యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్, సాంగ్స్ ఇలా అన్ని విభాగాల్లోనూ సత్తా చాటుతూ దూసుకుపోతోన్నాడు. ఇక, ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్‌లో ఉన్న తారక్.. వరుసగా ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు మరో పాన్ ఇండియన్ తెలుగు డైరెక్టర్‌తో ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఎవరా డైరెక్టర్? పూర్తి వివరాల్లోకి వెళితే...

భీకరమైన ఫామ్‌లో ఉన్న తారక్
ఆ మధ్య వరుస పరాజయాలతో సతమతం అయిన ఎన్టీఆర్.. 'టెంపర్'తో సక్సెస్ ట్రాక్ ఎక్కేశాడు. అక్కడి నుంచి వరుసగా 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్', 'జై లవ కుశ', 'అరవింద సమేత.. వీరరాఘవ' విజయాలను ఖాతాలో వేసుకున్నాడు. దీంతో అతడి మార్కెట్ కూడా భారీ స్థాయిలో వృద్ధి చెందింది. అప్పటి నుంచి తారక్ ఫుల్ స్వింగ్‌లో కనిపిస్తున్నాడు.

పాన్ ఇండియా స్టార్‌గా ఎన్టీఆర్
హిట్లు మీద హిట్లు కొడుతోన్న జూనియర్ ఎన్టీఆర్.. ఇటీవలే RRR (రౌద్రం రణం రుధిరం) మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. భారీ అంచనాలతో పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ సినిమా భారీ హిట్ అయింది. అంతేకాదు, ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. అలాగే, తారక్‌కు దేశ వ్యాప్తంగా క్రేజ్‌ను తీసుకొచ్చి అతడని పాన్ ఇండియా స్టార్‌ను చేసేసింది.

కొరటాలతో సినిమా.. ఫైనల్‌గా
RRR షూట్ జరుగుతున్నప్పుడే తారక్ తన 30వ సినిమాను కొరటాల శివతో చేస్తున్నట్లు ప్రకటించాడు. దీనిని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. దీనికి అనిరుథ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక, ఈ చిత్రం ఆగిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఇది మొదలవుతున్నట్లు తాజాగా ప్రకటించారు.

ప్రశాంత్ నీల్‌తో వచ్చే ఏడాది
ఈ మధ్య ఎన్టీఆర్ వరుసగా ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ఇందులో భాగంగానే అతడు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో సినిమా చేయబోతున్నాడు. ఈ విషయాన్ని గత ఏడాదే అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. ఇక, ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌లో కానీ, మేలో కానీ మొదలుపెట్టబోతున్నట్లు వెల్లడించారు.

మరో ఇద్దరు, ముగ్గురు డైరెక్టర్లు
ఇప్పటికే పలు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుని ఉన్న జూనియర్ ఎన్టీఆర్.. మరికొందరు దర్శకులతోనూ కథా పరమైన చర్చలు జరుపుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇలా ఇప్పటికే ఈ స్టార్ హీరో ఉప్పెన దర్శకుడు బుచ్చి బాబు సన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. అలాగే, వెట్రిమారన్, అట్లీ, త్రివిక్రమ్‌లతోనూ సినిమాలు చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

సీతా రామం డైరెక్టర్‌తో సినిమా
వరుస విజయాలతో కెరీర్‌లోనే బీభత్సమైన ఫామ్‌తో దూసుకుపోతోన్న జూనియర్ ఎన్టీఆర్.. ఇప్పుడు మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఇటీవలే 'సీతా రామం' సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో సత్తా చాటుతున్న హను రాఘవపూడితో తారక్ సినిమా చేయబోతున్నాడట. ఈ సినిమాను విభిన్నమైన మాస్ యాక్షన్ కథతో తెరకెక్కించబోతున్నారని కూడా తెలిసింది.

శక్తి తర్వాత ఆ బ్యానర్‌లో తారక్
హను రాఘవపూడితో ఎన్టీఆర్ చేయబోయే సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ నిర్మించబోతున్నారని తెలుస్తోంది. గతంలో వీళ్ల కాంబోలో వచ్చిన 'శక్తి' మూవీ డిజాస్టర్ అయింది. ఇప్పుడా లోటును పూడ్చేందుకు తారక్ - అశ్వనీదత్ కలుస్తున్నారట. ఇక, ఈ సినిమా ప్రకటన త్వరలోనే రానుందని.. దీన్ని వచ్చే ఏడాది పట్టాలెక్కిస్తారని టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











