జూ ఎన్టీఆర్ గెస్ట్ గా నటిస్తున్నాడా?
హైదరాబాద్: ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ గా వినపడుతున్న టాక్ ఏమిటంటే జూ.ఎన్టీఆర్ గెస్ట్ గా నటిస్తున్నాడు అని. అదీ మంచు విష్ణు చిత్రం దేనికైనా రెడీ చిత్రంలో. మోహన్ బాబుకీ, జూ.ఎన్టీఆర్ కి ఉన్న అనుభందంతో ఈ సినిమా కమిటయ్యాడని చెప్పుకుంటున్నారు. అయితే దీనికి సంభందించి మంచు విష్ణు గానీ,ఎన్టీఆర్ గానీ అధికారికంగా ఏమీ చెప్పలేదు. నిజంగా ఎన్టీఆర్ గెస్ట్ గా చేస్తే దాచేదేముంది.. పబ్లిసిటీ కోసమైనా వెల్లడి చేస్తారుగా.. కాబట్టి ఇది రూమరే అంటున్నారు మరికొంతమంది సినీ జనం.
గతంలోనూ ఎన్టీఆర్ వెంకటేష్..చింతకాయల రవి చిత్రంలో గెస్ట్ గా కనిపించి అలరించారు. ఆ చిత్రం నిర్మాత నల్లమలుపు బుజ్జితో ఉన్న అనుభందంతో ఎన్టీఆర్ అప్పుడు గెస్ట్ గా చేసారు. ఇక ఈ రూమర్ మొదలవ్వటానికి అవటానికి కారణం ఆ మధ్యన జూ.ఎన్టీఆర్ ని.. మంచు విష్ణు.. బ్యాంకాక్ షెడ్యూల్ లో కలిసారు. ఆ విషయాన్ని మంచు విష్ణు ట్విట్టర్ లో అందరితో పంచుకున్నారు. దీని ఆధారంగా ఈ న్యూస్ పుట్టి ఉంటుందంటున్నారు.
విష్ణు, హన్సిక జంటగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఇది. ఈ చిత్రంలో ప్రభాస్ వాయిస్‌ని ఇమిటేట్ చేశారు విష్ణు. పాత్రలో భాగంగా జరిగిన అనుకరణ ఇది. ఈ పాత్రకు ప్రభాస్ డబ్బింగ్ చెబితే బాగుంటుందని విష్ణు భావించారట.
ఈ విషయం గురించి విష్ణు చెబుతూ -''నాకు సినిమా పరిశ్రమలో ప్రభాస్, నితిన్, సునిల్ మంచి స్నేహితులు. పాత్ర డిమాండ్ చేస్తే వారి వాయిస్‌ని అనుకరించాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను. 'దేనికైనా రెడీ'లో అది కుదిరింది. నేనడగ్గానే కాదనకుండా ప్రభాస్ డబ్బింగ్ చెప్పాడు. అందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను'' అన్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై డా. మోహన్‌బాబు సమర్పణలో విష్ణు నిర్మిస్తున్న ఈ చిత్రానికి చక్రి సంగీతం అందిస్తున్నారు. విష్ణు నటించిన చిత్రాల్లో 'ఢీ' సూపర్‌హిట్ అయ్యింది. 'ఢీ'కీ 'దేనికైనా రెడీ'కీ పోలికలు లేనప్పటికీ హిట్ పరంగా ఈ చిత్రం 'ఢీ 2' అవుతుందనే టాక్ ఉంది. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











