తాతపేరు చెప్పుకునే జూ ఎన్టీఆర్ కి తలబిరుసు....
సీనియర్ ఎన్టీఆర్ 15వ వర్థంతిని పురస్కరించుకుని ఆయన సతీమణి లక్ష్మీపార్వతి కొన్ని టీవి చానెల్స్ ద్వారా తన మనోభావాలను పంచుకుంది. ఈ సందర్భంగా లక్ష్మీపార్వతి మాట్లాడుతూ 'ఎన్టీఆర్ వారసులు ఎన్టీఆర్ పేరును వాళ్ళ లాభాల కోసం మాత్రమే వాడుకుంటున్నారు. ఎన్టీఆర్ అంతటి నటన అటు బాలయ్యగానీ ఇటు జూ ఎన్టీఆర్ గానీ కనబర్చలేకపోతున్నారు. ఎన్టీఆర్ నటనకు ఒకింత దగ్గరగా బాలయ్య వెళ్ళగలుగుతున్నాడు గానీ, జూ ఎన్టీఆర్ కు మాత్రం అంత నటనలేదు.
తాత పేరు చెప్పుకుంటూ ఆయన నటవారసుడుని నేనే అంటున్న జూ ఎన్టీఆర్ పెద్ద అహంకారి అనీ, ఆ అహంకారాన్ని తొలగించుకుని స్వర్గీయ ఎన్టీఆర్ నటనపై అధ్యయనం చేస్తే ఆయన నటనలో పదో వంతైనా జూనియర్ ఎన్టీఆర్‌కు అబ్బుతుందని ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి అన్నారు. ఎన్టీఆర్ తనకున్న తలబిరుసుతనాన్ని కాస్తంత తగ్గించుకుని నటనను మెరుగుపరుచుకుంటే మంచిది. ఎన్టీఆర్ పోలికలు జూ ఎన్టీఆర్ కి వచ్చి ఉండొచ్చుగానీ..నటన పరంగా మాత్రం అంత లేదు" అని చెప్పింది.


Click it and Unblock the Notifications











