జూ ఎన్టీఆర్-హన్సికల ‘సింహధ్వని’!
'సింహధ్వని" ఈ పేరును పదేళ్ళ క్రితం బాలకృష్ణ నటించగా విడుదలైన 'సమరసింహారెడ్డి"కి మొదట అనుకున్న టైటిల్ ఇది. అప్పుడు నందమూరి వారి ఫ్యామిలీని మిస్సయినా త్వరలో నందమూరి నటసోగ్గాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాకు ఇదే టైటిల్ ను పెట్టాలనుకుంటున్నారని విశ్వసనీయంగా తెలిసింది. త్వరలో ఎన్టీఆర్ ని హీరో గా పెట్టి ఓ భారీ చిత్రాన్ని తీయడానికి వెల్ ఫేర్ క్రియేషన్స్ సంస్థ సన్నాహాలు చేసుకుంటున్న సంగతి విదితమే.
ఈ చిత్రంలో ఎన్టీఆర్ సనసన హన్సికని సెలెక్ట్ చేస్తే బాగుంటుందని ఆమెను సంప్రదించగా ..ఆమె రెమ్యునరేషన్ ని ఎక్కువ డిమాండ్ చేస్తోందట...కానీ వారు అనుకున్న కథను ఎన్టీఆర్ సరసన హన్సిక అయితేనే కథకు న్యాయం జరుగుతుందని భావిస్తుండటంతో హన్సికనే సెలెక్ట్ చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారట. ఈ చిత్రానికి 'సింహధ్వని, సింహబలుడు" అనే రెండు టైటిల్స్ ని పరిశీలిస్తున్నారని, ఇందులో 'సింహధ్వని" టైటిల్ కే ఎక్కువ మార్కులు పడ్డాయని ఫిలింనగర్ సమాచారం.


Click it and Unblock the Notifications











