సింగం 2 దర్శకుడితో జూ ఎన్టీఆర్!

By Bojja Kumar

హైదరాబాద్ : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తమిళ దర్శకుడు హరితో కలిసి పని చేయబోతున్నాడా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. ఇటీవల సూర్య‌తో సింగం-2 సినిమా తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన హరి జూనియర్ ఎన్టీఆర్‌తో తెలుగు సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాడని టాక్. త్వరలో వీరి విషయమై ఓ క్లారిటీ రానుంది.

జూ ఎన్టీఆర్ నటించిన సింహాద్రి, యమదొంగ, బృందావనం చూసిన హరి....అతనితో ఓ పవర్ ఫుల్ కథాంశంతో కూడిన సినిమా చేయాలనే ప్లానో ఉన్నాడని అంటున్నారు. సింగం-2 తర్వాత కార్తితో సినిమా చేయాలని హరి అనుకున్నప్పటికీ అనుకోని కారణాలతో ఆ ప్రాజెక్టు ప్రస్తుతానికి ఆగిపోయిందట.

ప్రస్తుతం జూ ఎన్టీఆర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో 'రామయ్యా వస్తావయ్యా' చిత్రంలో నటిస్తున్నారు. జూ ఎన్టీఆర్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'రామయ్యా వస్తావయ్యా'. ఈ చిత్రానికి సంబంధించిన భారీ యాక్షన్ సీన్ ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించారు. దాదాపు 1000 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్న ఈ సీన్ జూ ఎన్టీఆర్ సింగిల్ టేక్‌లో కంప్లీట్ చేసాడట.

ఈచిత్రం షూటింగ్ ఆగస్టు 26 నుండి స్పెయిన్లో జరిపేందుకు రంగం సిద్దమైంది. తమన్ ఆడియో కంపోజింగ్ పూర్తి చేయడంతో అందులోని రెండు సాంగులను స్పెయిన్ దేశంలోని అందమైన లొకేషన్లలో చిత్రీకరించేందుకు ప్లాన్ చేసారు. ఈ రెండు సాంగులు ప్రేక్షకులకు నయనానందకరంగా అద్భుతమైన డాన్స్ స్పెప్పులతో పాటు, రొమాంటిక్‌గా తెరకెక్కించబోతున్నారని తెలుస్తోంది.

ఈచిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్ 27న విడుదల చేసి తీరుతామని అంటున్నారు దర్శక నిర్మాతలు. ఆగస్టు మూడో వారంలో ఆడియో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. శృతి హాసన్ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది.

బాద్‌షా తర్వాత ఎన్టీఆర్‌, గబ్బర్‌సింగ్‌ తర్వాత హరీశ్‌ శంకర్‌ చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై అంచనాలు అంబరాన్నంటుతున్నాయి. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె. నాయుడు, సంగీతం: తమన్, కూర్పు: గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మ కడలి, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, సతీష్ వేగ్నేశ, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, నిర్మాత దిల్ రాజు, కథ-మాటలు-దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X