దిల్ రాజు పై జూ ఎన్టీఆర్ గరంగరం!
జూనియర్ ఎన్టీఆర్ తన నిశ్చితార్థం కుటుంబ పరిమితివరకే అయినా ప్రత్యేకంగా కొంతమంది సినిమా ఇండస్ట్రీ వారిని ఆవ్వానించడం గమనార్హం. దిల్ రాజును నివ్చితార్ధానికి ఆహ్వానించకపోవడం తెలిసిందే. అయితే ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో 'బృందావనం" సినిమా రూపుదిద్దుకొంటున్న విషయం తెలిసిందే. నిన్న నిర్మాత మండలి అత్యవసర సమావేశం ఏర్సాటు చేశారు, మరీ ముఖ్యంగా ఈ కమిటీ హీరోల పారితోషికాలపై కోత విధించాలనే ఆలోచలతోనే సమావేశమైనట్టు సమాచారం.
తనతో సినిమా తీస్తున్న దిల్ రాజ్ సినిమా నిర్మాణవ్యమం తగ్గించడం కోసం ఏర్సాటైన కమిటీకి నేతృత్వం వహిస్తుండంపై ఎన్టీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తునట్లు సమాచారం అందుతోంది. బృందావనం చిత్రం విషయమై పారితోషికం విషయంలో ఎన్టీఆర్ కు దిల్ రాజుకు మధ్య విబేధాలు ఏర్సడ్డాయని ఇంతకుముందు నుంచీ ప్రచారం జరుగుతున్న నేపద్యంలో ఈ అంశం మరింత ప్రాధాన్యత సంతరించుకోనుంది. ఈ తాజా పరిణామాలు వీళ్లిద్దరి మద్యా మరింత అగాధంసృష్టించే ప్రమాదముందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
దిల్ రాజు, ఎన్టీఆర్ తో 'బృందావనం" ప్రభాస్ తో దశరధ్ దర్శకత్వంలో సినిమాలు తీస్తున్న విషయం తెలిసిందే అయితే అత్యవసరసమావేశానికి నాయకత్వం వహించడమే చాలా పెద్ద తప్పిదం చేశారని పలువురు భావిస్తున్నారు. అసలే వరుస పరాజయాలతో ఇమేజ్ డామేజ్ అయి వున్న దిల్ రాజు ఇంత తెలివితక్కువగా ఎందుకు వ్యవహరిస్తున్నాడనే దానిపై ఫిలింనగర్ లో జోరుగా చర్చ జరుగుతోంది.


Click it and Unblock the Notifications











