జూనియర్ ఎన్టీఆర్ హాలీవుడ్ ఎంట్రీ.. హింట్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్..
Jr NTR: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నందమూరి తారక రామరావు మనవడుగా ఇండస్ట్రీలో ప్రవేశించినప్పటికీ.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న తారక్. చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. RRR మూవీతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరల్డ్ వైడ్ క్రేజ్ సొంతం చేసుకున్నారు. దీంతో ప్రపంచమంతా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ యాక్టింగ్ స్కిల్స్ చూసి విదేశీయులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ త్వరలో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని ఓ న్యూస్ లీకైంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం!
డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన RRR మూవీతో జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు గ్లోబల్ స్టార్‌గా ఎదిగాడు. తన అభినయం, యాక్షన్ స్కిల్స్‌తో కేవలం తెలుగు ప్రేక్షకులనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచుకుంటున్నాడు.RRR Movieతో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ సినిమాలో తారక్ యాక్షన్, ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఎన్టీఆర్ నటనపై హాలీవుడ్ సినీ ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపించారు. 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్‌లో గ్లోబల్ ఆడియెన్స్ చూసి ఎన్టీఆర్ యాక్టింగ్ కు ఫిదా అయ్యారు.

RRR సినిమాలో ప్రధానంగా టైగర్ తో ఇంట్రీ ఇవ్వడం, అడవి జంతువులతో చేసిన యాక్షన్ సీన్స్ ఎన్టీఆర్ ను హై లెవల్ కు తీసుకెళ్లాయి. ఎన్టీఆర్ యాక్టింగ్ కు హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు జేమ్స్ గన్ సైతం ఫిదా అయిపోయారు. ఎంతలంటే.. ఏకంగా ఎన్టీఆర్‌తో సినిమా చేయాలని ఉందని, తన మనసులోని కోరికను బయటపెట్టారు.ప్రస్తుతం హాలీవుడ్ డైరెక్టర్ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.తారక్ తన నటనతో తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాడని ప్రశంసలు కురిపిస్తున్నారు.
హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ గన్ మాట్లాడుతూ.. "RRR సినిమాలో ఎన్టీఆర్ యాక్టింగ్ తనకు చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చింది. మెయిన్ గా వైల్డ్ యానిమల్స్ తో వచ్చే సీన్స్ లో ఎన్టీఆర్ నటన చాలా నచ్చింది. ఎన్టీఆర్ తో కలిసి వర్క్ చేయాలని కోరుకుంటున్నాను," అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జేమ్స్ గన్ 'గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ,' 'ది స్యూసైడ్ స్క్వాడ్' వంటి హిట్ చిత్రాలను రూపొందించిన దర్శకుడు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ హాలీవుడ్ ఎంట్రీ అంటూ ఫ్యాన్ కామెంట్స్ చేస్తున్నారు.
భవిష్యత్తులో తప్పకుండా ఎన్టీఆర్ వంటి నటులు గ్లోబల్ ప్రాజెక్టుల్లో నటిస్తారని హాలీవుడ్ డైరెక్టర్స్ కామెంట్స్ ద్వారా అర్ధమవుతుంది. తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతోంది. హాలీవుడ్ దర్శకులు కూడా తెలుగులో ఉన్న ప్రతిభను గుర్తించడం గర్వకారణమని మూవీ లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. జూనియర్ ఎన్టీఆర్ .. హృతిక్ రోషన్‌తో కలిసి నటించిన వార్ 2లో బాలీవుడ్‌లో అరంగేట్రం చేయబోతున్నాడు. KGF సృష్టికర్త ప్రశాంత్ నీల్‌తో కలిసి యాక్షన్ థ్రిల్లర్ మూవీలో కలిసి పని చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











