ఎన్టీఆర్ మహేష్ ని ఫాలో చేస్తున్నాడా?
ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మాట్లాడుకుంటున్న విషయం.. జూ ఎన్టీఆర్.. పనిగట్టుకుని మరీ మహేష్ ని ఫాలో చేస్తున్నాడని. అయితే అది యాదృచ్చికంగా జరుగుతోందో మరొకటో కాని మహేష్ తో సినిమాలు చేసిన లేదా చేయబోతున్న దర్శకులు అంతా ఎన్టీఆర్ ముందు క్యూ కట్టడంతో ఈ టాక్ జనరేట్ అవుతోంది. దూకుడు హిట్టవగానే శ్రీను వైట్ల వెంటనే ఎన్టీఆర్ ని కలిసి బాద్షా ప్రాజెక్టుని ఓకే చేయించుకున్నారు. అలాగే బిజినెస్ మ్యాన్ హిట్ కొట్టాక వెంటనే పూరీ జగన్నాధ్ ..ఎన్టీఆర్ ని కలిసి సినిమాని సెట్ చేసుకున్నారు. ఇక మహేష్ తో సినిమా కమిటైన సుకుమార్ నెక్ట్స్ ప్రాజెక్టు హీరోగా ఎన్టీఆర్ ని ఓకే చేయించుకున్నారు.
ఇలా అక్కడ మహేష్ తో చేసిన వారంతా తమ తర్వాత ప్రాజెక్టులకు ఎన్టీఆర్ ని ఎంచుకుంటున్నారు. దీనికి కారణం కేవలం యాధృచ్చికమే అని చెప్పాలి. ఎందుకంటే ఓ పెద్ద హీరోతో చేసాక నెక్ట్స్ ఆ దర్శకుడు మరో పెద్ద హీరోకు వెళ్లటం సహజం..ఎన్టీఆర్ తో అతిధి చేసిన సురేంద్రరెడ్డి తన తదుపరి చిత్రానికి మహేష్ దగ్గరికి వెళ్లాడు. అలా ఇక్కడ ఏ హీరో మరో హీరోని ఫాలో చెయ్యరు. కేవలం దర్శకులు మాత్రమే ఒక హీరో నుంచి మరో హీరోకి వెళ్తూంటారు.


Click it and Unblock the Notifications











