డైరెక్టర్ క్రిష్‌తో జూ ఎన్టీఆర్ సంప్రదింపులు?

By Bojja Kumar

హైదరాబాద్: ‘రామయ్యా వస్తావయ్యా', ‘రభస' ఇలా వరుస పరాజయాలతో సతమతం అవుతున్న జూ ఎన్టీఆర్‌కు కథల ఎంపిక విషయంలో తర్జన భర్జనలు పడుతున్నాడు. రొటీన్ కమర్షియల్ కథలను ఎంచుకుని ఖంగుతిన్న...కొత్త కథలను ఎంచుకోవడంలో కూడా తర్జన భర్జనలు పడుతున్నాడు. అయితే ఎలాగైనా హిట్ట కొట్టాలనే తాపత్రయం మాత్రం ఎన్టీఆర్‌లో కనిపిస్తోంది.

Jr NTR to interest work with Krish

ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ వివిధ దర్శకులను తన తర్వాతి సినిమా కోసం పరిశీలిస్తున్నాడు. తెలుగులో గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రాలకు దర్శకత్వం వహించి ప్రస్తుతం బాలీవుడ్లో ‘గబ్బర్' సినిమా చేస్తున్న డైరెక్టర్ క్రిష్‌తో ఎన్టీఆర్ సంప్రదింపులు జరినట్లు తెలుస్తోంది. అన్ని ఓకే అయితే వీరి కాంబినేషన్లో సినిమా వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రాన్నిఅశ్వనీదత్ నిర్మించనున్నట్లు ఇండస్ట్రీ టాక్.

ప్రస్తుతం ఎన్టీఆర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. మాస్ యాక్షన్ ఎంటర్టెనర్ గా రూపొందుతోన్న ఈచిత్రంలో జూ ఎన్టీఆర్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి వక్కతం వంశీ కథ అందిస్తున్నారు. పూరి జగన్నాధ్ తన ట్రేడ్ మార్క్ డైలాగ్స్, ఫాస్ట్ స్క్రీన్ ప్లే ని జోడించాడు. గతంలో వక్కంతం వంశీ..ఎన్టీఆర్ నటించిన అశోక్, ఊసరవెల్లి చిత్రాలకు కథలు అందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పై బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందించిన బండ్ల గణేష్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X