Jr NTR: కొత్త బిజినెస్‌లోకి యంగ్ టైగర్ ఎన్టీఆర్.. భారీ పెట్టుబడులు.. అసలు కథ ఏంటంటే?

సుమారు ఐదు, ఆరు సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీలో తన మార్క్ చూపిస్తూ దూసుకుపోతున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు.

ఇందులో కొమురం భీమ్ పాత్రలో నటించి తారక్ నటనకు యావత్ ప్రపంచమే ఫిదా అయింది. ప్రస్తుతం NTR30 సినిమాతో బిజీగా ఉన్న తారక్ వ్యాపార రంగంలోకి అడుగు పెడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

JR NTR Investing In Film Studio News Goes Viral

తారక్ సినిమాలు: డైరెక్టర్ రాజమౌళితో రౌద్రం.. రణం.. రుధిరం (RRR) సినిమాతో గ్లోబల్ స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. దీంతో ఆయన తర్వాతి సినిమాపై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు కొరటాల శివతో తారక్ సినిమా చేస్తున్నట్లు అనౌన్స్ వచ్చింది. NTR30 వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ రానుండగా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

JR NTR Investing In Film Studio News Goes Viral

దేవర అనే టైటిల్: NTR30 సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ రెండు పాత్రలతో అదరగొడుతాడని వార్తలు వస్తున్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో దాదాపుగా రూ. 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో బాలీవుడ్ గ్లామర్ డాల్, అలనాటి అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ తెలుగు చిత్ర పరిశ్రమలోకి తెరంగేట్రం చేయనుంది. ఈ సినిమాకు దేవర అనే టైటిల్ ను ఖరారు చేసినట్లుగా టాక్ అయితే వస్తుంది.

JR NTR Investing In Film Studio News Goes Viral

సెలబ్రిటీల పెట్టుబడులు: అంతేకాకుండా NTR30 సినిమాలో జాన్వీ కపూర్ తో పాటు మరోక హీరోయిన్ ను కూడా తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ తాజాగా వ్యాపార రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సినీ సెలబ్రిటీలు సినిమాల్లో నటించడమే కాకుండా పలు సంస్థల్లో పెట్టుబడులు పెడుతున్నారు. అందుకే ఈ వార్తలు అంతలా వైరల్ అవుతున్నాయి.

JR NTR Investing In Film Studio News Goes Viral

ఐదు అంతస్తులున్న: అయితే తారక్ ఓ ఫిల్మ్ స్డూడియోలో భారీగా పెట్టుబడులు పెడుతున్నారని సమాచారం. శంషాబాద్ దగ్గర కొంతమంది స్నేహితులతో కలిసి స్థలం కొనేందుకు ఐదు అంతస్తులున్న స్టూడియోను నిర్మించారట. అందులోనే NTR30 షూటింగ్ జరుగుతోందని టాక్. ఎన్టీఆర్ తో పాటు ఆయన ఫ్రెండ్స్ వివేక్ కూచిబోట్ల, నిర్మాత అభిషేక్ అగర్వాల్, తాహిర్ టెక్నిక్ స్టూడియో వారు ఇన్వెస్ట్ చేశారని అంటున్నారు.

JR NTR Investing In Film Studio News Goes Viral

మరోలా ప్రచారం: అయితే తాహిర్ స్టూడియోస్ సినిమా షూటింగ్స్ కు అవసరమైన కెమెరాలు, క్రేన్స్ వంటి వాటిని లీజుకు ఇస్తుంది. అంతే కానీ ఎన్టీఆర్ ఫిల్మ్ స్టూడియోలో పెట్టుబడులు పెట్టడంలో ఎలాంటి నిజం లేదని మరికొందరు అంటున్నారు. కల్యాణ్ రామ్ నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ లో భాగమైన హరికృష్ణ ఫిల్మ్ స్టూడియోలో పెట్టుబడులు పెట్టారట. దీన్ని మరోలా ప్రచారం చేస్తున్నారని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X