జూ ఎన్టీఆర్ పెళ్ళికి సమీరా రెడ్డికి పిలుపు!?
నరసింహుడు, అశోక చిత్రాలు చేస్తున్నప్పుడు ఎన్టీఆర్ కీ, సమీరా రెడ్డీకీ మధ్య లవ్ ఎఫైర్ నడిచిందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ ...లక్ష్మీ ప్రణతిని పెళ్ళి చేసుకుంటున్న నేపధ్యంలో సమీరా రెడ్డిని వివాహానికి పిలుస్తాడా లేదా అన్న విషయం హాట్ టాపిక్ గా మారింది. అయితే సమీరా రెడ్డి ఈ పెళ్ళి విషయం తెలియగానే ఎన్టీఆర్ కి ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పిందని సమాచారం. అయితే మొదట ఈ కాల్ ని ఊహించని ఎన్టీఆర్ ఆశ్చర్యపోయాడని, ఆ తర్వాత ఆమెకు ధాంక్స్ చెప్పి...ఇన్విటేషన్ కార్డు పంపుతానని, హైదరాబాద్ లో పెళ్ళి జరుగుతుందని, తప్పని సరిగా రావాలని కోరినట్లు చెప్తున్నారు. అలాగే ఆమె కూడా తప్పనిసరిగా మ్యారేజ్ కి అటెండవుతానని హామీ ఇచ్చిందని తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ వివాహం నవంబర్ 18న జరగనుంది. ఆ రోజు తెలుగు,తమిళ చిత్ర పరిశ్రమల నుంచి భారీ ఎత్తున సినీ జనం తరిలి వస్తారని,అలాగే రాజకీయనాయకులు కూడా చాలా మంది హాజరు అవుతారని అంచనా.


Click it and Unblock the Notifications











