ఎన్టీఆర్ నెక్ట్స్ లెవెల్ ప్లానింగ్ .. బాలీవుడ్‌లో పాతుకుపోయే స్కెచ్?

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర పార్ట్ 1 బ్లాక్ బస్టర్ కావడంతో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఖుషిగా ఉన్నారు. డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఏకంగా రూ.500 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి సంచలన సృష్టించింది. దేవర పూర్తి చేయడంతో ఎన్టీఆర్ తన తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో తారక్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

ఆర్ఆర్ఆర్, దేవర పార్ట్ 1 వంటి వరుస బ్లాక్ బస్టర్స్‌తో ఎన్టీఆర్ మంచి ఊపులో ఉన్నారు. ఇప్పటికే గ్లోబల్ స్టార్ ఇమేజ్ సాధించిన తార్.. బాలీవుడ్‌లోనూ సత్తా చాటాలని యోచిస్తున్నారు. దీనిలో భాగంగా బాలీవుడ్ సూపర్‌స్టార్ హృతిక్ రోషన్‌తో కలిసి వార్ 2 మూవీలో నటిస్తున్నారు ఎన్టీఆర్. ఈ సినిమాతో తారక్ హిందీ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టనున్నారు. ఇందులో తారక్ క్యారెక్టర్, గెటప్ నెవ్వర్ బిఫోర్ అన్నట్లుగా ఉంటుందని ఫిలింనగర్ టాక్.

Jr NTR is planning to sign more Hindi movies here s the details

వార్ 2లో ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్‌లో నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇటీవల కపిల్ శర్మ షోకు వచ్చిన ఎన్టీఆర్.. వార్ 2 గురించి కొన్ని హింట్స్ ఇచ్చాడు. అందులోనూ బాలీవుడ్ సూపర్‌స్టార్‌కి విలన్‌గా తారక్ నటించడం తెలుగుతో పాటు నార్త్ ఆడియన్స్‌లోనూ ఆసక్తి రేపుతోంది. స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా వచ్చే ఏడాది ఆగస్ట్ 15 వార్ 2 ప్రేక్షకుల ముందుకు రానుంది.

Jr NTR is planning to sign more Hindi movies here s the details

ఇదిలాఉండగా.. వార్ 2కి సంబంధించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఓ స్పెషల్ సాంగ్ ఉండనుందని.. ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఈ ఐటెం సాంగ్‌లో నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. స్త్రీ2తో హిట్ కొట్టిన శ్రద్ధా కపూర్ ఈ విషయంలో ప్రముఖంగా వినిపిస్తోంది. టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల కూడా ఛాన్స్ దక్కించుకున్నట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

ఇదిలాఉండగా .. టాలీవుడ్‌లో తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్న ఎన్టీఆర్ పాన్ ఇండియా రేంజ్‌లో ముఖ్యంగా బాలీవుడ్‌లోనూ బలంగా జెండా పాతాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. వార్ 2 తర్వాత మరిన్ని హిందీ చిత్రాల్లో నటించాలని తారక్ ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ భారీ బడ్జెట్‌తో ఎన్టీఆర్‌తో సినిమా తీయడానికి రెడీ అయినట్లుగా తెలుగు వార్తా సంస్థ తెలుగు 360 నివేదించింది. ఆదిత్య చోప్రా - ఎన్టీఆర్‌ల మధ్య ఈ మేరకు డిస్కషన్స్ నడుస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి కూడా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తారని వార్తలు వస్తున్నాయి. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

More from Filmibeat

Read more about: jr ntr war 2 hrithik roshan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X