ఆ విషయంలో బాలయ్యకు భయంలేదు మరి జూ ఎన్టీఆర్ కెందుకు భయం....!?
పౌరాణిక పాత్రలు పోషించడానికి యువ హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ని మించినవాడు లేడని ఇప్పటికే పేరొచ్చేసింది. యంగ్ యముడిగా చేసిన విన్యాసాలే అతడి సామర్థ్యాన్ని నిరూపించాయి. తనకీ తాతలా భారీ పౌరాణిక చిత్రాలు చేయాలని ఉందని జూ ఎన్టీఆర్ చాలాసార్లు చెప్పాడు కూడా. అయితే ఇంతవరకు అతని ఆశలకు సినీ రూపమివ్వడానికి ఎవరూ పూనుకోవడం లేదు. రాజమౌళి, వివి వినాక్ లాంటి దర్శకులు అనుకుంటే అదేమంత పెద్దవిషయం కాదు. అయినా కానీ ఎన్టీఆర్ తో అలాంటి సినిమా అనౌన్స్ చేయడానికి నిర్మాతలు జంకుతున్నారు.
కానీ బాలకృష్ణ తో మాత్రం 'శ్రీరామరాజ్యం" స్థాపించడానికి ఎలాంటి అవరోధాలు ఎదురు కాలేదు. బడ్జెట్ సమస్యలనేవి ఆ సినిమాకైనా తప్పవు. అలాంటప్పుడు బాలయ్యతో అలాంటి సినిమా చేయగలిగిన సాహసానికి ఒక చిన్న నిర్మాత పూనుకున్నప్పుడు, జూ ఎన్టీఆర్ తోనూ అలాంటి చారిత్రాత్మక చిత్రాన్ని నిర్మించడానికి అతని డేట్స్ కోసం పరితపించే పెద్ద నిర్మాతలు ఎందుకు ప్రయత్నించడంలేదు.
ప్రయోగాలకి బాలయ్య ఏనాడూ వెరువలేదు. కేవలం కమర్షియల్ సినిమాలకే కాక ఆదిత్య 369, భైరవద్వీపం, శ్రీకృష్ణార్జున విజయం లాంటి చిత్రాల్లో బాలయ్య నటించారు. మరి ఎన్టీఆర్ ఎందుకు అలాంటి సాహసం చేయడానికి ధైర్యం చేయడం లేదు? శ్రీరామరాజ్యం హిట్టయితే అయినా జూ ఎన్టీఆర్ కి ధైర్యమెస్తుందేమో వేచిచూడాల్సిందే...


Click it and Unblock the Notifications











