యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన కార్తీక!?
మెహర్ రమేష్ దర్శకత్వంలో అశ్వనీదత్ నిర్మిస్తున్న 'శక్తి"?లో ఎన్టీఆర్ సరసన సెకండ్ హీరోయిన్ గా కార్తీక నటించనుందని సమాచారం. ఇందులో ఇలియానా ప్రధాన నాయిక కాగా కార్తీక మదర్ రాధ గతంలో జూ ఎన్టీఆర్ తాత, బాబాయ్ లైన ఎన్టీఆర్, బాలయ్యలతో జోడి కట్టింది. 1983లో ఎన్టీఆర్ పుట్టినరోజున విడుదలైన 'చండశాసనుడు" చిత్రాన్ని ఎన్టీఆర్ రూపొందించి అందులో రాధ, శారదలను నాయికలుగా నటింపజేశాడు. ఆ తర్వాత రాధ ఎన్టీఆర్ తో చేయలేదు. బాలయ్యతో మాత్రం 'కలియుగ కృష్ణుడు, దొంగరాముడు, రాముడు-భీముడు, ముద్దుల కృష్ణయ్య, రక్తాభిషేకం, నిప్పులాంటి మనిషి" చిత్రాలలో నటించింది. ఎఎన్ ఆర్, నాగార్జునలతో జోడికట్టిన రాధ అక్కినేని మూడో తరపు వారసుడి సరసన కార్తీకను నటింపజేసి ఇప్పుడు నందమూరి మూడో తరపు వారసుడి సరసన నటింపజేయనుంది. ఈ కాంబినేషన్ కుదిరితే గనుక కార్తీక ఓ రికార్డు సాధించినట్టే. అలాగే 'శక్తి" అనే టైటిల్ కుదిరితే గనుక అందులో కూడా కార్తీకకు మరో విశేషమే. ఎందుకంటే గతంలో ఈ టైటిల్ తో వచ్చిన సినిమాలో రాధ నటించింది గనుక.


Click it and Unblock the Notifications











