ఆ దర్శకుడిని వెయిటింగ్ లో పెట్టిన ఎన్టీఆర్, ఇప్పట్లో కష్టమే!

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో ఆయన రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ నిజానికి త్రివిక్రమ్ తో ఒక సినిమా చేయాల్సి ఉంది. అనుకోని కారణాల నేపథ్యంలో ఆ సినిమా క్యాన్సిల్ కావడంతో కొరటాల శివ ఎన్టీఆర్ తో సినిమా అనౌన్స్ చేశారు. ఇదంతా ఇలా ఉంటే ఎన్టీఆర్ కోసం ఒక దర్శకుడు వెయిటింగ్ మోడ్ లో ఉన్నాడని తెలుస్తోంది. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు ఎందుకు వెయిటింగ్ ఊర్లో ఉన్నాడు అనే వివరాల్లోకి వెళితే

 ఆర్ఆర్ఆర్ తో బిజీగా

ఆర్ఆర్ఆర్ తో బిజీగా

తెలుగు సినీ పరిశ్రమలో ఎన్టీఆర్ తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నాడు. నందమూరి వంశం నుంచి హీరోగా ఎంటర్ అయిన ఆయన కొద్దిరోజుల్లోనే స్టార్ హీరో హోదా సంపాదించాడు.. వరుస సినిమాలతో విజయాలు అందుకుంటూ ఆయన తెలుగులో ఉన్న సక్సెస్ఫుల్ హీరోలలో ఒకరిగా నిలుస్తున్నారు. రాజమౌళితో సింహాద్రి యమదొంగ లాంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమాలు చేసిన ఎన్టీఆర్ చాలా కాలం తర్వాత ఆయనతో కలిసి ఇప్పుడు ప్రతిష్టాత్మక ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కావాల్సి ఉంది.

రాజమౌళి సినిమా తరువాత కొరటాలతో

రాజమౌళి సినిమా తరువాత కొరటాలతో

అయితే రాజమౌళితో సినిమా పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో కలిసి ఒక సినిమా చేయాలని భావించారు. అయినను పోయిరావలె హస్తినకు అనే ఒక్క టైటిల్ కూడా ప్రచారంలోకి వచ్చింది.. కానీ ఏమైందో ఏమో తెలియదు అనూహ్యంగా ఈ సినిమా ఆగిపోయింది. ఈ సినిమా స్థానంలో కొరటాల శివ ఎన్టీఆర్ 30వ సినిమా తెరకెక్కిస్తున్నారు అని అధికారిక ప్రకటన వెలువడింది. ఆ తర్వాత త్రివిక్రమ్ మహేష్ బాబుతో కూడా సినిమాను అనౌన్స్ చేశారు.

ఆ దర్శకుడికి రెండో ఛాన్స్

ఆ దర్శకుడికి రెండో ఛాన్స్

అయితే మధ్యలో ఎన్టీఆర్ ఒక కొత్త దర్శకుడికి అవకాశం ఇస్తున్నారు అని ప్రచారం జరిగింది. ఉప్పెన సినిమాతో దర్శకుడిగా పరిచయమై మంచి పేరు తెచ్చుకున్న బుచ్చి బాబుతో ఆయన సినిమా చేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. సుకుమార్ శిష్యుడిగా ఆయన వద్దనే దర్శకత్వం నేర్చుకున్న బుచ్చిబాబు ఉప్పెన సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. తక్కువ బడ్జెట్ తో చేసిన ఆ సినిమాకు భారీ కలెక్షన్స్ రావడంతో ఈయనకు రెండోసారి కూడా తమ బ్యానర్ లోనే సినిమా చేసే అవకాశం కల్పించారు మైత్రి మూవీ మేకర్స్ వాళ్లు.

వెయిటింగ్ మోడ్ లో దర్శకుడు

వెయిటింగ్ మోడ్ లో దర్శకుడు

అయితే బుచ్చిబాబు రెండో సినిమా కూడా ఎన్టీఆర్ తో చేస్తున్నాడని ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతూ వస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ప్రస్తుతానికి బుచ్చిబాబు ఎన్టీఆర్ కోసం వెయిట్ చేస్తున్నాడని అంటున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ బుచ్చి బాబు స్క్రిప్ట్ కి ఓకే చెప్పాడు గాని సినిమా ఎప్పుడు చేయాలి ? అనే విషయం మీద క్లారిటీ ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతో ఎన్టీఆర్ కోసం వెయిట్ చేస్తూ బుచ్చిబాబు ప్రస్తుతానికి వెయిటింగ్ మోడ్ లో ఉన్నారని అంటున్నారు.

Recommended Video

Bigg Boss Telugu Season 5 Update : Jr NTR టీవి షో కూడా అప్పుడే ! || Filmibeat Telugu
అప్పటి దాకా వెయిట్ చేయాల్సిందే

అప్పటి దాకా వెయిట్ చేయాల్సిందే

ఎన్టీఆర్ దృష్టి అంతా ప్రస్తుతం రాజమౌళి సినిమా మీదనే ఉంది, రాజమౌళితో సినిమా పూర్తయిన తర్వాత ఆయన కొరటాల శివతో సినిమా ప్రారంభిస్తారు. ఆ సినిమా వచ్చే ఏడాది జూన్ వరకు షూటింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అప్పటిదాకా బుచ్చిబాబు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేయాల్సిందే అని అంటున్నారు. మరి ఇందులో నిజానిజాలు ఏమేరకు ఉన్నాయనేది కాలమే నిర్ణయించాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X