జూ.ఎన్టీఆర్, కొడాలి నాని, వల్లభనేని వంశీ కలిసే...

By Srikanya

ఎన్టీఆర్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో అప్పట్లో ఎమ్మల్యే అనే చిత్రం ప్రారంభమవుతుందని వార్తలు వచ్చాయి. ఆ చిత్రాన్ని నల్లమలుపు బుజ్జి నిర్మించనున్నారని చెప్పారు. అయితే అనుకోకుండా ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. ఎమ్మల్యే అంటే మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి అనే విచిత్రమైన డెఫినిషియన్ కూడా ఇచ్చారు. అయితే ఆ తర్వాత ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్లలేదు. దాంతో అతను రవితేజను పట్టుకుని మిరపకాయ అనే హిట్ కొట్టి వెంటనే పవన్ తో ఛాన్స్ కొట్టారు. దబాంగ్ రీమేక్ గబ్బర్ సింగ్ లో బిజీ అయ్యారు. ఇలాంటి సమయంలో ఇప్పుడు అతనికి ఎన్టీఆర్ నుంచి ఆహ్వానం వచ్చింది. బయిట లైటర్ వీన్ కామిడీలు రన్ అవుతున్న ఈ మూడ్ లో ఓ పక్కా కామిడీ ఎంటర్టైనర్ చేయాలని ఎన్టీఆర్ భావిస్తున్నాడు. ఊసరవెల్లి చిత్రం డివైడ్ టాక్ రావటం కూడా దీనికి ఒక కారణం అంటున్నారు. ఇక ఈ చిత్రాన్ని కొడాలి నాని, వల్లభనేని వంశీ నిర్మించనున్నారని చెప్తున్నారు. ఇంతకుముందు వారు అదుర్స్ సినిమాని నిర్మించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ దమ్ము చిత్రం చేస్తన్నాడు.

ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంకి అక్కడ ఓ పెద్ద సెట్ వేసి షూటింగ్ చేస్తున్నారు.అలాగే ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సన్నివేశాల్లో మీసం ఉండనున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి పండగ సీజన్ కి విడుదల అయ్యేలా చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు.ఇక ఎన్టీఆర్ ఇప్పుడు ఎక్కడ మాట్లాడినా 'దమ్ము"ప్రసక్తి తెస్తున్నారు. ఆ చిత్రం ఫ్యాన్స్ కి విందు భోజనంలా ఉంటుందని అని పని గట్టుకుని మరీ చెప్తున్నారు. అలాగే తాను లావు తగ్గి చేసే డాన్స్ లు హైలెట్ గా ఉంటాయని నొక్కి మరీ చెపున్నారు. భవిష్యత్ లో తాను లావు గా కనపడనని, గతంలో కనపించినంత లావుగా కానని,తగ్గిపోతానని,ఆ విషయం దమ్ము చిత్రం లో గమనించవచ్చునని ఎన్టీఆర్ తన అభిమానులకు హామీ ఇచ్చారు.

ఎన్టీఆర్ తన దృష్టినంతా తాజా చిత్రం 'దమ్ము"పై కేంద్రీకరిస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.యస్.రామారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శృతిహాసన్ హీరోయిన్ గా చేస్తున్న చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. బాలకృష్ణతో గత సంవత్సరం 'సింహా"లాంటి విజయవంతమైన చిత్రాన్ని అందించిన తర్వాత బోయపాటి శ్రీను చేస్తోన్న ఈ చిత్రం పట్ల ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా బోయపాటి శ్రీను తనదైన శైలిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడని చెప్తున్నారు. అలాగే ఈ చిత్రానికి 'దమ్ము" అనే టైటిల్‌ని త్వరలో అధికారికంగా ఖరారు చేయనున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఎన్టీఆర్ మీడియా సమావేశంలో ధృవీకరించారు. ఈ చిత్రానికి సంబంధించిన మరో షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. మార్చిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి యం.యం.కీరవాణి సంగీతాన్నందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X