ఎన్టీఆర్ - కొరటాల మూవీ వివరాలు లీక్: కథ.. క్యారెక్టర్.. టైటిల్ ఇవే.. పాతదే అయినా కొత్తగా!

కొన్నేళ్లుగా వరుస విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తూ ముందుకెళ్తున్నాడు. ఇప్పటికే దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తోన్న RRRలో నటిస్తున్న తారక్.. తన 30వ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో చేస్తున్నట్లు ప్రకటించాడు. కానీ, ఇటీవల తన నిర్ణయాన్ని మార్చుకుంటూ ఈ చిత్రాన్ని కొరటాల శివతో చేయనున్నట్లు వెల్లడించాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు లీక్ అయ్యాయి. ఆ సంగతులు మీకోసం!

టాలీవుడ్‌లోనే ప్రతిష్టాత్మక చిత్రంలో తారక్

టాలీవుడ్‌లోనే ప్రతిష్టాత్మక చిత్రంలో తారక్

ప్రస్తుతం దర్శకధీరుడు జూనియర్ ఎన్టీఆర్.. రాజమౌళి తెరకెక్కిస్తోన్న RRR (రౌద్రం రణం రుధిరం)లో రామ్ చరణ్‌తో కలిసి నటిస్తున్నాడు. అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత కథల ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇందులో చరణ్.. అల్లూరిలా, ఎన్టీఆర్.. కొమరం భీంలా నటిస్తున్నారు.

త్రివిక్రమ్ సినిమా ప్రకటనకే పరిమితమైంది

త్రివిక్రమ్ సినిమా ప్రకటనకే పరిమితమైంది

'అరవింద సమేత' వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత త్రివిక్రమ్ - జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతుందని ప్రకటించిన విషయం తెలిసిందే. 'అయిననూ పోయి రావలె హస్తినకు' అనే టైటిల్‌తో ఇది వస్తుందని ప్రచారం జరిగింది. అనౌన్స్ చేసి చాలా కాలం అయినా.. ఇది ప్రారంభించలేదు. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రకటనకే పరిమితం అయిపోయింది.

కొరటాల శివతో మరోసారి.. ఇప్పుడు అలా

కొరటాల శివతో మరోసారి.. ఇప్పుడు అలా

'జనతా గ్యారేజ్' వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత కొరటాల శివతో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు ఎన్టీఆర్. నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌తో రూపొందనుంది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఎన్టీఆర్ - కొరటాల మూవీ వివరాలు లీక్

ఎన్టీఆర్ - కొరటాల మూవీ వివరాలు లీక్

సూపర్ హిట్ కాంబినేషన్ కావడంతో ఎన్టీఆర్ - కొరటాల శివ మూవీపై అప్పుడే అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే ఈ ప్రాజెక్టు గురించి ఎన్నో ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే ఇందులో హీరో పాత్ర, కథ గురించి కొన్ని వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన పలు వివరాలు బయటకు వచ్చాయి.

ఆ భాషలో కూడా.. హీరోయిన్‌గా కియారా

ఆ భాషలో కూడా.. హీరోయిన్‌గా కియారా

పాన్ ఇండియా రేంజ్‌తో యూనివర్శల్ కాన్సెప్టుతో వస్తున్న ఈ సినిమాను హిందీలోనూ రూపొందిస్తున్నారని తెలిసింది. అందుకే బాలీవుడ్ బ్యూటీ అయిన కియారా అద్వాణీతో కొరటాల సంప్రదింపులు జరిపాడని అంటున్నారు. ఆమె నటించని పక్షంలో మరో హిందీ హీరోయిన్‌నే తీసుకుంటారని తెలుస్తోంది. అలాగే, ఈ చిత్రానికి మణి శర్మ సంగీతం అందించబోతున్నాడని టాక్.

సినిమా కథ.. హీరో క్యారెక్టర్.. టైటిల్ ఇవే

సినిమా కథ.. హీరో క్యారెక్టర్.. టైటిల్ ఇవే

ఈ సినిమా ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటోన్న ఓ ముఖ్యమైన సమస్య గురించి తెరకెక్కబోతుందట. ఇందులో హీరో పల్లెటూరి నుంచి పట్టణానికి వచ్చి ఆ సమస్యను పరిష్కరించేందుకు పోరాటం చేస్తాడట. పాత లైనే అయినా అతడి ఎలివేషన్ హైలైట్‌గా ఉంటుందని తెలుస్తోంది. ఇక, ఈ సినిమాకు 'రాజా వచ్చినాడు' అనే టైటిల్‌ను ఫిక్స్ చేయబోతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X