Devara: జూనియర్ ఎన్టీఆర్ 'దేవర'లో అదే అసలు ట్విస్ట్.. అందుకే ఆ టైటిల్!
దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమాతో గ్లోబల్ స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. దీంతో ఆయన తర్వాతి సినిమాపై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రస్తుతం డైరెక్టర్ కొరటాల శివతో తారక్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. NTR30 అనే వర్కింగ్ టైటిల్ మొదలైన ఈ సినిమాకు ఇటీవలే దేవర అని నామకరణం చేశారు. దానికి తోడు విడుదల చేసిన పోస్టర్ బీభత్సంగా రెస్పాన్స్ అందుకుంటోంది. అయితే ఈ మూవీకి దేవర అనే టైటిల్ పెట్టడం, అందులోని ట్విస్ట్ పై ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి.
తెలుగులోనే కాకుండా: రౌద్రం రణం రుధిరం సినిమాతో ఇంటర్నేషనల్ స్థాయిలో పేరు సంపాదించుకున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఈ సినిమా తర్వాత తారక్ చేసే ప్రాజెక్టులపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అందుకు తగినట్లుగానే ఎన్టీఆర్ సినిమాలను లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది. తారక్ తెలుగులోనే కాకుండా హిందీలో కూడా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

ప్రతినాయకుడిగా: బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన వార్ సినిమా సీక్వెల్ లో ఎన్టీఆర్ నటిస్తున్నట్లు ఇదివరకే ప్రకటన వచ్చింది. ఇందులో తారక్ ప్రతినాయకుడిగా కనువిందు చేయనున్నాడు. ఇక కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో అటెన్షన్ డ్రా చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఆయనతో NTR31 సినిమా కూడా చేస్తున్నాడు.

శవాల గుట్టల్లో: ఇక తెలుగు ప్రముఖ దర్శకుడు కొరటాల శివతో తారక్ చేస్తున్న సినిమా దేవర. ఈ మూవీ టైటిల్ ను తారక్ బర్తే డే సందర్భంగా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. దేవర టైటిల్ తో పాటు ఎన్టీఆర్ లుక్ ఉన్న మోషన్ పోస్టర్ విడుదల చేశారు. చేతిలో కత్తి, ఒళ్లంత రక్తంతో, సముద్రపు అలల మధ్య, శవాల గుట్టల్లో ఉన్న ఎన్టీఆర్ ను చూసి అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు.
చాలా ఎఫెక్టివ్ రోల్: దేవర టైటిల్ మోషన్ పోస్టర్ కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ సినిమాలో అసలు ట్విస్ట్ ఇదేనని ఓ వార్త చక్కర్లు కొడుతోంది. దేవర సినిమాలో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ చేయనున్నాడని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. అందులో ప్లాష్ బ్యాక్ లో వచ్చే తండ్రి పాత్ర పేరే దేవర అని ప్రస్తుతం టాక్ నడుస్తోంది. మూవీలో ఆయన పాత్రే చాలా ఎఫెక్టివ్ గా ఉంటుందని, అందుకే ఆయన పేరుతో టైటిల్ పెట్టినట్లుగా సమాచారం.

కొడుకు రోల్: ఇక కొడుకు పాత్రలో వచ్చే పేరుకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేస్తోంది. విలన్ గా బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్, ఆయనకు జోడీగా టీవీ నటి చైత్ర రాయ్, ప్రకాష్ రాజు తదితరులు నటిస్తున్నారు. అనిరుధ్, రత్నవేలు, శ్రీకర్ ప్రసాద్ వంటి టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ చేయనున్నారు.


Click it and Unblock the Notifications











