NTR 30 Story Leak: ఎన్టీఆర్‌తో కొరటాల శివ అలాంటి ప్రయోగం.. యంగ్ టైగర్ రోల్ లీక్!
జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో రాబోతున్న ఎన్టీఆర్ 30వ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తప్పకుండా ఈ సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని ఫ్యాన్స్ ఎంతో నమ్మకంతో ఉన్నారు.
కొరటాల కూడా ఈ సినిమాతో తప్పకుండా సక్సెస్ కొడతాను అనే ధీమాతో కనిపిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఇద్దరు ఎన్టీఆర్లు కనిపించబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇక మరొక పాత్ర ఎలా ఉండబోతుంది అనే వివరాల్లోకి వెళితే...

ఇదివరకే ఒక క్లారిటీ: జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటివరకు ఎన్నో మాస్ కమర్షియల్ సినిమాలు చేశారు. అయితే అంతకుమించి గ్రాండీయర్ అనే తరహాలో ఎన్టీఆర్ 30వ సినిమా ఉండబోతుందట. ఈ సినిమా ఒక ఐలాండ్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుంది అని నరరూప రాక్షసులతో జూనియర్ ఎన్టీఆర్ పోరాట సన్నివేశాలు అద్భుతంగా ఉండబోతున్నాయి అని కొరటాల శివ ఇదివరకే ఒక క్లారిటీ ఇచ్చాడు.
కనెక్ట్ అయ్యే విధంగా: మంచి మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు సినిమాలో అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా ఒక మంచి సందేశం కూడా కొరటాల ఈ సినిమాలో ఇవ్వబోతున్నాడట. ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక ఎలిమెంట్ హైలెట్ చేస్తూ వస్తున్న కొరటాల శివ ఇందులో కూడా గ్లోబల్ పాయింట్ ను టచ్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాను ఫ్యాన్ ఇండియా రేంజ్ లోనే దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్లో నిర్మిస్తున్నట్లుగా తెలుస్తోంది.

డబుల్ యాక్షన్: ఇక జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో రెండు విభిన్నమైన పాత్రలో కనిపించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఒకటే క్యారెక్టర్ ను రెండు షేడ్స్ లలో చూపిస్తారేమో అని మొదట అనుకున్నారు. కానీ ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్రకారం ఎన్టీఆర్ డబుల్ యాక్షన్ ఈ సినిమాలో హైలెట్ కాబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇదివరకే జూనియర్ ఎన్టీఆర్ కొన్ని సినిమాలలో డబుల్ యాక్షన్ లో కనిపించినప్పటికీ అవి పెద్దగా వర్కౌట్ కాలేదు.
ఎన్టీఆర్ రెండు పాత్రలు: అయితే ఇప్పుడు మాత్రం ఎన్టీఆర్ రెండు పాత్రలను కూడా కొరటాల శివ పవర్ఫుల్ గా ప్రజెంట్ చేయబోతున్నాడట. అందుకు సంబంధించిన ఒక లీక్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ ఒక కొడుకు పాత్రలోనే కాకుండా తండ్రి పాత్రలో కూడా కనిపించబోతున్నాడట. ఫ్లాష్ బ్యాక్ లో ఫాదర్ కు సంబంధించిన హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ తో పాటు మంచి ఎమోషన్ కూడా ఈ సినిమాలో హైలెట్ కాబోతున్నట్లు తెలుస్తోంది.

విభిన్నమైన షేడ్స్ ఉండే విధంగా: ఇంతకుముందు జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్రావాలా సినిమాలో తండ్రి కొడుకుల పాత్రలో కనిపించాడు. కానీ ఫ్లాష్ బ్యాక్ లో ఎన్టీఆర్ చేసిన పాత్రకు అంతగా గుర్తింపు రాలేదు. కాని ఈసారి మాత్రం కొరటాల శివ ఆ తరహాలో కాకుండా ఇద్దరిలోనూ విభిన్నమైన షేడ్స్ ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అంతేకాకుండా ఆ క్యారెక్టర్స్ చాలా పవర్ఫుల్ గా ఉంటాయని కూడా టాక్ వినిపిస్తోంది. మరి కొరటాల శివ అభిమానుల అంచనాలను ఎంతవరకు అందుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











