మరోసారి పెరుగుతున్న జూనియర్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్.. ఇప్పుడే ఇలా ఉందంటే..?

మన స్టార్ హీరోల మార్కెట్ మరికొన్ని రోజుల్లో బాలీవుడ్ హీరోలతో సమానంగా కొనసాగడం కాయంగా కనిపిస్తోంది. రాజమౌళి వేసిన పాన్ ఇండియా బాటతో దాదాపు మన అగ్ర హీరోలందరు కూడా పాన్ ఇండియా బాట పట్టేశారు. దీంతో మార్కెట్ తో పాటు రెమ్యునరేషన్ కూడా అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ రాబోయే సినిమాలకు కూడా గట్టిగానే డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.

Recommended Video

Jr NTR వదులుకున్న Blockbusters | Happy Birthday NTR || Filmibeat Telugu
 బెస్ట్ ఆల్ రౌండర్ గా

బెస్ట్ ఆల్ రౌండర్ గా

స్టార్ హీరోగా ఎదగడానికి జూనియర్ ఎన్టీఆర్ ఏ రేంజ్ లో కష్టపడ్డాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ లో బెస్ట్ డ్యాన్సర్ గానే కాకుండా డైలాగ్ చెప్పడంలో కూడా నెంబర్ వన్ అనిపించుకున్నాడు. అంతే కాకుండా సింగర్ గా కూడా క్లిక్కయ్యాడు. బెస్ట్ ఆల్ రౌండర్ గా క్రేజ్ అందుకుంటున్న తారక్ తో సినిమా అంటే ఏ నిర్మాత, దర్శకుడైనా సరే ఇట్టే ఒప్పేసుకుంటున్నారు.

 పవర్ఫుల్ హిట్టు కొట్టడం కాయం

పవర్ఫుల్ హిట్టు కొట్టడం కాయం


ఇక జూనియర్ ఎన్టీఆర్ మొదటిసారి పాన్ ఇండియా సినిమాను టచ్ చేస్తున్న విషయం తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR సినిమాలో రామ్ చరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న తారక్ పవర్ఫుల్ హిట్టు అందుకోవడం కాయమని చెప్పవచ్చు. ఆ సినిమాలో కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ హై వోల్టేజ్ సినిమాకు రెమ్యునరేషన్ కూడా గట్టిగానే అందుతోందట.

RRR రెమ్యునరేషన్

RRR రెమ్యునరేషన్


RRR సినిమా కోసం అయితే 30కోట్లకు పైగా ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా కొంత అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాత సినిమా బిజినెస్ అనంతరం మిగిలిన ఎమౌంట్ ఇస్తానని డీల్ సెట్ చేసుకున్నట్లు సమాచారం. అంతే కాకుండా లాభాల్లో కూడా షేర్ రావచ్చని సమాచారం. దాదాపు రామ్ చరణ్ కూడా ఇదే తరహాలో డీల్ సెట్ చేసుకున్నట్లు టాక్ అయితే వస్తోంది.

ఆ సినిమా తరువాత హాఫ్ సెంచరీ..

ఆ సినిమా తరువాత హాఫ్ సెంచరీ..

ఇక RRR అనంతరం మరో రెండు పాన్ ఇండియా ప్రాజెక్టులను సెట్ చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా లాభాల్లో వాటా అనే పద్దతిలోనే వెళుతున్నట్లు సమాచారం. కొరటాల శివతో చేసే సినిమా అన్నయ్య ప్రొడక్షన్ కూడా మిక్స్ చేసి ఉంది కాబట్టి వాటా ప్రాసెస్ లోనే వెళుతున్నాడు. ఇక ప్రశాంత్ నీల్ సినిమాకు మాత్రం 40కోట్ల వరకు మాట్లాడినట్లు టాక్ అయితే వస్తోంది. ఇక RRR హిట్టయితే ఆ తరువాత చేయబోయే సినిమాలకు ఈజీగా 50జోట్లను డిమాండ్ చేస్తాడని చెప్పవచ్చు. మరి తారక్ మార్కెట్ మొత్తంగా ఎంతవరకు పెరుగుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X