రవితేజను చూసి నవ్వుతున్న ఎన్టీఆర్

By Srikanya

జూ.ఎన్టీఆర్ కి రవితేజను చూస్తే నవ్వువస్తోంది. దానికి కారణం తనకు శక్తి అనే టైటిల్ తో పెద్ద ప్లాఫ్ ఇచ్చిన మెహర్ రమేష్ ఆ శక్తి టైటిల్ నే కాస్త ఇంగ్లీష్ లో పవర్ అని ట్రాన్స్ లేట్ చేసి రవితేజను పడేయటమేనంటున్నారు. కథ కూడా అలాంటిదే తెచ్చి కాస్త మార్చి చెప్పి ఉంటాడని కామెంట్స్ చేస్తున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అయితే రవితేజ ఈ ప్రాజెక్టు ఓకే చేయటానికి కారణం కేవలం డబ్బు మాత్రమేనంటున్నారు. రవితేజ తన రెమ్యునేషన్ ని కాస్త పెంచి ఇస్తే కథ, మిగతా విషయాలు పట్టించుకోడని చాలా కాలంగా టాక్ వినపడుతోంది. అది ఈ ప్రాజెక్టు ఓకే చేయటంతో నిజం అయ్యిందని అంటున్నారు. ఇక 'సిద్ధు ఫ్రం శ్రీకాకుళం" 'సీతారాముల కల్యాణం లంకలో" 'సీమ టపాకాయ్"చిత్రాలను అందించిన వెల్ఫేర్ క్రియేషన్స్ సంస్థ ఈ భారీ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఈ చిత్రంపై నిర్మాత మళ్ల విజయప్రసాద్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఆయన మాట్లాడుతూ..'వెల్ఫేర్ క్రియేషన్స్ సంస్థ ద్వారా 'పవర్" చిత్రాన్ని రూపొందిస్తున్నాం. రవితేజ, మెహర్ రమేష్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథను అందిస్తున్నారు. బడ్జెట్‌తో నిమిత్తం లేకుండా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రవితేజ 'ఇడియట్-2" తర్వాత మార్చి నెలలో షూటింగ్ ప్రారంభించి సింగిల్ షెడ్యూల్‌లో చిత్రాన్ని పూర్తి చేస్తామ"ని తెలిపారు. దర్శకుడు మెహర్ రమేష్ మాట్లాడుతూ- 'వంశీ కథ రవితేజకు కరెక్ట్‌గా సరిపోతుంది. 'కిక్" తర్వాత మరో డైమన్షన్‌లో రవితేజ 'పవర్"ని ఈ చిత్రంలో చూస్తాం. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. మిగతా వివరాలు త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X