లారెన్స్ దర్శకత్వంలో జూ ఎన్టీఆర్!
కొరియోగ్రాఫర్ నుంచి డైరక్టర్ కమ్ హీరోగా మారిన లారెన్స్ నాగార్జునతో మాస్, డాన్ చిత్రాలు రూపొందించిన రాఘవ లారెన్స్ తో మూడోసారి నాగార్జున సినిమాకి డైరక్ట్ చేయనున్నాడని సమాచారం. అయితే లారెన్స్ ఆ మధ్యప్రెస్ మీట్ లో మాట్లాడుతూ 'తమిళనాడులో రాఘవేంద్ర స్వామి ఆలయ నిర్మాణంలో బిజీగా ఉండడంతో సినిమాలకు దూరమయ్యాను. త్వరలో డైరెక్షన్ చేస్తాను అని చెప్పడం గమనార్హం.
ఈ సందర్భంగా 'మహేష్ బాబు, ప్రభాస్, నాగార్జున, బన్నీలను దష్టిలో పెట్టుకుని మొదలు పెడతాను" అన్నారు. అయితే 'ఆ నలుగురు" హీరోలతో పాటు ఇంకో హీరో వచ్చి చేరాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, లారెన్స్ కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కనుందనేది ఫిలిం వర్గాల సమాచారం. ఇదే నిజమైతే అద్బుతమైన కొరియోగ్రఫీ ప్రతిభకు ఓ వండర్ డాన్సర్ తోడవుతాడన్న మాట!
ప్రస్తుతం లారెన్స్ 'సూపర్ కౌబాయ్" అనే భారీ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. అలాగే అనుష్క తో లారెన్స్ దర్శత్వంలో 'కాంచన" అనే లేడీ ఓరియంటెడ్ చిత్రం రూపుదిద్దుకోబోతోందన్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











