ఎన్టీఆర్- మహేష్ మ్యాచ్ ఫిక్సింగ్?

By Staff

Jr Ntr-Mahesh Babu
జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు దాదాపు ఒకే వయో వర్గానికి చెందిన వారు. ఇద్దరికీ మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ రోడ్ షోలకు వస్తున్న మహా స్పందన చూసి స్పందించిన మహేష్ బాబు జూనియర్ కు ఫోన్ చేసి అభినందించినట్టు తెలుస్తోంది. అంతే గాకుండా తన కుటుంబ సభ్యురాలైన గల్లా అరుణ కుమారి (ప్రస్తుత రాష్ట్ర మంత్రి) పోటీ చేస్తున్న చంద్రగిరి స్ధానంలో ప్రచారం చేయవద్దని మహేష్ బాబు జూనియర్ ను రెక్వెస్ట్ చేసుకున్న సమాచారం టీవీ చానల్స్ కు నేడు లీక్ అయింది.

చంద్రగిరి స్ధానం నుంచి హీరో కృష్ణ వియ్యంకురాలైన గల్లా అరుణ కుమారి కాంగ్రెస్ తరఫున, రోజా తెలుగుదేశం తరఫున పోటీ చేస్తున్నారు. ఈలోపు జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబుల మధ్య ఈ మ్యాచ్ ఫిక్సింగ్ ఏమిటి? అంటే తమ కులానికి చెందిన గల్లా అరుణ కుమారి కోసం జూనియర్ ఎన్టీఆర్ తన సొంత తెలుగుదేశం పార్టీకి చెందిన రోజా ఓటమికి పరోక్షంగా సహాయ పడాలా? ఇది న్యాయమా? ఒక పార్టీ తరఫున ప్రచారం చేసే ఎన్టీఆర్ లాంటి వ్యక్తి కమిట్ మెంట్ ఉంటే తన సొంత అన్న ప్రత్యర్ధిగా ఉన్నా తన పార్టీ తరఫున ప్రచారం చేసుకుంటూ పోవాలి. ముప్పై ఏళ్ళు దాటక ముందే ఈ యంగ్ హీరోలు రాజకీయ మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడడం చర్చనీయాంశమవుతోంది.

మరీ ముఖ్యంగా మహేష్ బాబు కుటుంబం మీద విమర్శలు వస్తున్నాయి. మాది మొదటి నుంచి కాంగ్రెస్ కుటుంబం అని చెప్పుకుని వైఎస్ ప్రభుత్వం ద్వారా పద్మాలయ భూముల కోసం 150 కోట్ల రూపాయల లబ్ది పొందిన తర్వాత ఇప్పుడు కృష్ణ తమ్ముడు ఆది శేషగిరిరావుకు ఎంపీ టికెట్ ఇవ్వలేదన్న కారణంగా తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించడానికి ఈ కుటుంబం సిద్ధమైంది. సినిమాల్లో నైతిక విలువల గురించి హీరోలుగా ఉపన్యాసాలు దంచే మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ లు ఇలా వివిధ పార్టీల్లో ఉంటూ కులం కోసం చివర్లో కుమ్మక్కులు కావడం జనాన్ని మోసగించడం కాదా? ఈ ఆర్టికల్ మీకు నచ్చితే మీ మిత్రులకు సన్నిహితులకు ఈ కింద ఉన్న ఇ-మెయిల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీ అభిప్రాయాలు మీ మిత్రులతో పంచుకోండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X