జూ ఎన్టీఆర్, మహేష్ కామెంట్స్ కి దూరంగాఉండాలంటే..వదిలేస్తే బెటరే...
ఏ ముహుర్తాన తలనొప్పి బామ్ లకి బ్రాండ్ అంబాసిడర్లుగా మారారో కానీ వెంటనే మహేష్ బాబు, జూ ఎన్టీఆర్ గట్టి ఝలక్ తిన్నారు. అమృ తాంజన్ తో ఒప్పందం చేసుకున్న వెంటనే మహేష్ కి ఖలేజా, జండూబామ్ కి సైన్ చేయగానే ఎన్టీఆర్ కి శక్తి వచ్చి పడ్డాయి. అన్నట్టు వీరిద్దరూ నవరతన్ కి జంట అంబాసిడర్లుగా కూడా పని చేస్తున్నారు. ఇద్దరికీ ఇవి అంతగా కలిసొచ్చినట్టు అనిపించడం లేదు.
మిగతా వాటి మాట ఎలా ఉన్నా కానీ నొప్పి ఆయింట్ మెంట్ లకి ప్రచారకర్తలుగా వ్యవహరిస్తుంటే, తమ సినిమాలు వచ్చినప్పుడు వేరే హీరోల అభిమానులు తమని కామెంట్ చేయడానికి సులువైన మార్గాలు లభిస్తున్నాయని మహేష్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఖలేజా, శక్తి వచ్చినప్పడు జండూబామ్, అమృ తాంజన్ బొమ్మలు వాడి ఇతర హీరోల అభిమానులు చేసి హంగామా అంతా ఇంతా కాదు. సాధారణంగా ఇలాంటి యాడ్స్ కి హీరోలు దూరంగా ఉంటారని, బాలీవుడ్ లోనూ ఎవరూ ఇలాంటివి చెయ్యరు కాబట్టి మనోళ్లూ త్వరగా వీటిని వదిలించుకుంటే బాగుంటుందని వారు వాపోతున్నారు.


Click it and Unblock the Notifications











