రాజమౌళి లేటెస్ట్ 'మర్యాద రామన్న' లో గెస్ట్ గా స్టార్ హీరో
రాజమౌళి, సునీల్ కాంబినేషన్ లో రూపొందుతున్న కామిడీ చిత్రం మర్యాదరామన్న. ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ గెస్ట్ గా చేసాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఈ షూటింగ్ రహస్యంగా పూర్తి చేసారని, ఒక్కసారి మార్కెట్ లోకి క్రేజ్ తేవటానికి ఎన్టీఆర్ ని ఉపయోగించుకున్నాడని చెప్తున్నారు. ఎన్టీఆర్ ఓ పాట, ఓ ఫైట్ లో కనపడతారని అంటున్నారు. ఇక ఈ చిత్రానికి ఊహించని విధంగా 28 కోట్లు వరకూ బిజినెస్ జరిగిందని, నిర్మాతలు చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పుకుంటున్నారు. డిస్ట్రిబ్యూటర్స్ చాలా ఉత్సాహంగా ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని ఎదురుచూస్తున్నారు. ఇక ప్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం ఫుల్ లెంగ్త్ కామిడీగా జరుగుతుంది. సలోని ఈ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది.
More from Filmibeat
జూ ఎన్టీఆర్ రాజమౌళి సునీల్ మర్యాద రామన్న ఫాక్షన్ బ్యాక్ డ్రాప్ సలోని saloni jr ntr rajamouli sunil maryada ramanna


Click it and Unblock the Notifications











